అన్నపై అలిగితే మాట్లాడటం మానేస్తా, పార్టీ ఎందుకు పెడతా?

  0
  240

  అన్న జగన్ పై అలిగితే.. ఆయనతో మాట్లాడటం మానేస్తాను కానీ.. పార్టీ ఎందుకు పెడతానని YSRTP అధ్యక్షురాలు షర్మిళ అన్నారు. తాను జగన్ పై అలిగే రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాననే ప్రచారం వాస్తవం కాదని ఆమె అన్నారు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్టే కనిపిస్తోందని కూడా చెప్పారు. కేసీఆర్ ఒక నియంత అని.. ఆయన పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని.. వాటిని చూడలేకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. తన పార్టీ తెలంగాణాలో ప్రభంజనం సృష్టిస్తుందని.. రాసి పెట్టుకోమని.. ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో నిరుద్యోగుల కోసం తాను పెద్ద వ్రతమే చేస్తున్నానని.. మహిళలంటే వ్రతాలే చేసుకోమని కేటీఆర్ చులకనగా మాట్లాడుతున్నాడని అన్నారు. YSR తెలంగాణాకు వ్యతిరేకం కాదని.. యూపీఏ మ్యానిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణను చేర్చింది ఆయనేనని గుర్తుంచుకోవాలన్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.