నాలుగు కోట్ల బెంట్లే కారు ఇదేందయ్యో..

  0
  526

  అంబానీ, అదానీని , ఆటోలోనో ,టౌన్ బస్సులోనో చూస్తే ఏమనుకుంటారు…? అదే ఫీలింగ్ ఈ కారు ఒక రోడ్ సైడ్ మెకానిక్ వద్ద చూస్తే కలుగుతుంది. నాలుగున్నర కోట్ల రూపాయలు విలువ చేసే బెంట్లే కారు ఒక రోడ్డు పక్కనే ఉన్న మెకానిక్ గ్యారేజీలో కనిపించింది. అంతే వెంటనే ఇంటర్నెట్లో ఇది సెన్సేషన్ గా మారిపోయింది. సాధారణంగా బీఎండబ్ల్యూ , బెంజ్ , రోల్స్ రాయిస్ , పోర్ష్ ఇలాంటి అత్యంత ఖరీదైన కార్లు రోడ్ సైడ్ మెకానిక్ గ్యారేజీలో కనిపించవు . ఎందుకంటే ఆ కంపెనీలు వేరే దగ్గర వీటికి మరమ్మతులు చేయించడానికి కానీ ఏ చిన్న మార్పు చేయించడానికి కానీ ఒప్పుకోరు. కోట్లరూపాయలు పెట్టి కార్లు కొన్నవాళ్ళు కంపెనీ నిబంధనల ప్రకారమే ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గరే ఇస్తారు. ఈ కార్లు మెయింటినెన్స్ కార్ల అధికృత షోరూంలోని చేయించుకోవాల్సి ఉంటుంది.

  అయితే ఈ బెంట్లే కారు ఇక్కడ ఎందుకు ఉన్నది అన్నది ఇంటర్నెట్లో ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అసలు దీనికి కారణం ఏంటంటే హై ఎండ్ కార్లు ఎంత ఖరీదుగా ఉంటాయో ఒక చిన్న మరమ్మతు అవసరమైనా దానికి చార్జీలు కూడా లక్షల్లోనే ఉంటాయి. అందువల్ల కొంతమంది కోట్లు పెట్టి కార్లు కొన్నప్పటికీ , మెయింటినెన్స్ విషయంలో మాత్రం చిన్నచిన్న గ్యారేజీ దగ్గర ఉన్న మెకానికుల్ని సంప్రదిస్తారు.

  ఇంతకీ ఈ నాలుగు కోట్ల కారు రోడ్ సైడ్ మెకానిక్ దగ్గర ఎందుకు ఉందంటే, ట్రాఫిక్ లో ఓ కారు ఈ కారును గీసుకుంటూ పోవడంతో పెయింట్ పోయిందట. దీనికి చాలా కొద్ది ప్రదేశం లోనే పెయింట్ పోవడంతో ఆ పెయింట్ వేసేందుకు కంపెనీ అది కృత డీలర్ ఐదు లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. అయితే దీన్ని రోడ్ సైడ్ మెకానిక్ దగ్గర కేవలం 2 వేల రూపాయలు ఇచ్చి పెయింట్ చేయించి ఓనర్ తీసుకెళ్లాడు. అసలు ఈ నాలుగు కోట్ల కారు రోడ్డు పక్కన మెకానిక్ షాప్ లో ఉండడం వెనక రహస్యం ఇదట. అందువలన కోట్లు పెట్టి కార్లు కొన్నవాళ్లు మెయింటినెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటారనేది ఈ సంఘటనతో అర్ధమైపోతుంది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

  NO COMMENTS

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here