ఇదొక అద్భుతమైన వంతెన, చూస్తేనే దడదడ .

    0
    128

    కొన్ని ఇంజనీరింగ్ అద్భుతాలకు చైనా పెట్టింది పేరు. ప్రపంచంలోనే ఎత్తైన 60 బ్రిడ్జిలలో చైనాలో ఉన్న జుచొంగి బ్రిడ్జ్ చాలా సంక్లిష్టమైన నిర్మాణంతో చేసింది. భూమి నుంచి 735 అడుగుల ఎత్తులో ఈ కాంక్రీట్ బ్రిడ్జిని నిర్మించారు. 2019లో నిర్మించిన ఈ బ్రిడ్జి మీదుగా చాంగ్ ఎక్స్ప్రెస్ హైవే పోతుంది. ఇది లోయలను ,నదులను దాటించే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కింద నుంచి చూస్తే దాదాపు 735 అడుగుల లోయ భయం కలిగించే విధంగా ఉంటుంది.

    ఈ బ్రిడ్జి పొడవు 672 మీటర్లు. ఒక్కొక్క స్పాన్ పొడవు 200 మీటర్లు అంటే దాదాపు నాలుగు స్పాన్లతో ఇంత పెద్ద బ్రిడ్జిని నిర్మించడం నిజంగా అద్భుతమే. ఈ వంతెనపైనుంచి చూస్తే అక్కడ ప్రకృతి వాతావరణ సౌందర్యం మైమరిపించేటట్టు ఉంటుంది. అందుకే కొన్ని దగ్గర హెచ్చరిక బోర్థులు కూడా పెట్టారు .

    బ్రిడ్జి మీద పోతూ చుట్టుపక్కల అందమైన వాతావరణంపై దృష్టి పెట్టొద్దన్న హెచ్చరికలు ఉంటాయి. ఏది ఏమైనా ఈ బ్రిడ్జి మీద పోతున్నప్పుడు వాహనాలు ఆకాశంలో విహరిస్తున్నంత ఫీలింగ్ ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడి నుంచి వీచే గాలికి వాహనాలు కూడా అటు ఇటు ఊగిపోయే పరిస్థితి ఉంటుంది అందువల్ల తీవ్రమైన గాలి దుమారాలు ఉన్నప్పుడు వాహనం నిదానంగానే పోవాలని హెచ్చరికలు కూడా ఉంటాయి.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here