చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    0
    15860

    ఇది సినిమా కథలాగే ఉంటుంది.. కానీ నిప్పులాంటి నిజం.. ప్రేమలో ఎంత త్యాగముందో చెప్పే వాస్తవం.. నమ్ముకున్న సిద్ధాంతంకోసం నమ్మిన వారివెంట నడిచిన జీవితం.. అడవి బిడ్డలకోసం బావ ముళ్లబాటను ఎంచుకుంటే , దాన్నే పూలబాటగా చేసుకొని విప్లవోద్యమంలో బావతో కలిసిపోరాడి , మూడురోజుల వ్యవధిలో బావతోనే ప్ర్రాణాలొదిలిన సమ్మక్క అలియాస్ బారతక్క జీవితం.. మావోయిస్టు టాప్ లెవెల్ లీడర్ హరిభూషణ్ మరణం తరువాత రెండు రోజుల వ్యవధిలో ఆయన భార్య బారతక్క కూడా చనిపోయింది. హరిభూషణ్ , బారతక్క బావామరదళ్ళు .. బావ హరిభూషణ్ చదువు పూర్తయ్యాక , పెళ్లిచేసుకుందామనుకుంది..

    అయితే బావ ఉద్యమబాట పట్టి అడవులకు వెళ్ళిపోయాడు.. సమ్మక్క అలియాస్ శారద మాత్రం బావతోనే జీవితమనుకొని అదే అడవి బాటపట్టింది. తల్లితండ్రులు , బంధువులు యెంత వారించినా వినలేదు.. చావును కోరితెచ్చుకుంటున్నావని , అడవుల్లో ఉండలేవని చెప్పినా ఆమె చెవికి ఎక్కలేదు.. బావ కోసం అడవిబాట పట్టింది.. తుపాకీ చేతపట్టింది.. భావనే పెళ్లిచేసుకుంది.. అతడితోనే అడవితల్లి ఒడిలో ఒదిగిపోయింది.. ఉద్యమంలో ఉన్నారు కాబట్టి , బిడ్డలు కూడా వద్దనుకుంది. మధ్యలో అనారోగ్యం వస్తే ఇంటికొచ్చి , కొంతకాలం ఉండి , మళ్ళీ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది.

    మళ్ళీ తుపాకి చేతబట్టి భర్త ఆశయాలకు అండగా ఉండిపోయింది.. బావతోపాటే ఎన్నో ఎన్ కౌంటర్లు తప్పించుకున్నా , కరోనా ఎన్ కౌంటర్ నుంచి ఇద్దరూ తప్పించుకోలేకపోయారు.. 21 న హరిభూషణ్ , 24 న సమ్మక్క అలియాస్ బారతక్క చనిపోయారు.. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధ్రువీకరించారు. కానీ, మావోయిస్టు పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..