భర్తలు చేసే ఫిర్యాదులు విచారణకు తీసుకోండి..

  0
  258

  జాతీయ మహిళా కమిషన్ మాదిరి జాతీయ పురుషుల కమిషన్ ని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు తిరస్కరించారు. గృహహింస ,అత్యాచారాలు లాంటి చర్యలు మహిళల మీదనే కాదని, పురుషుల మీద కూడా జరుగుతున్నాయి అంటూ ఓ వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

  పురుషులు కూడా మహిళల చేతుల్లో చాలా చిత్రహింసల గురవుతున్నారని ఆ బాధలు పడలేక చాలామంది జీవితాలు చాలించుకుంటున్నారని, అందువల్ల మహిళల మాదిరి పురుషులకు కూడా ఒక పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషన్ వేశారు. అందరికీ సమాన న్యాయం అనేది రాజ్యాంగం మౌలిక స్ఫూర్తి అని అలాగే మహిళలకు రక్షణకు ఎటువంటి చట్టాలు ఉన్నాయో పురుషుల రక్షణ కూడా అలాంటి చట్టాలే అమలు పరచాలని కోరారు. ఇందుకు సంబంధించి దేశంలో భర్తలపై లేదా పురుషులపై జరిగిన అనేకమైన సంఘటనలు ఉదహరించారు.

  ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ మరియు దీపాంకర్ దత్త విచారణ జరిపి ఈ పిటిషన్ విచారణకు స్వీకరించలేమని కొట్టివేశారు. మహేష్ కుమార్ తివారి అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. ఇతను అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. 2021 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెలువరించిన జాబితా ఆధారంగా ఆయన కొన్ని గణాంకాలు కూడా ఇచ్చాడు. దేశం మొత్తం మీద 1,643 మంది బలవన్మరణాలకు పాల్పడితే అందులో 81 వేల 63 మంది పురుషులు ఉన్నారని, 28,680 మంది మాత్రమే వివాహితులైన మహిళలు ఉన్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని బట్టి పురుషులే గృహహింసను తట్టుకోలేక జీవితాలు చాలించుకుంటున్నారని కూడా ఆయన వాదించారు. ఈ ఒక్క సంవత్సరమే దేశవ్యాప్తంగా ఒక లక్ష 1879 మంది పురుషులు బలవన్మరణం పొందారని వివరించారు.

  అందువల్ల దేశంలో పురుషుల పట్ల ఎలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయో వీటికి కారకులెవరు విచారించేందుకు జాతీయ పురుషుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలన్నది ఆయన వాదన. అయితే ఈ పిటిషన్ న్యాయమూర్తులు కొట్టివేశారు. అయితే గుడ్డిలో మెల్లగా , దేశంలో భర్తలు , భార్యలపై చేసే ఫిర్యాదులను విచారణకు స్వీకరించమని ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు కోరింది. జాతీయ పురుషుల కమీషన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు న్యాయ కమీషన్ ని కోరాలని కూడా సూచించింది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here