పెళ్ళికొడుకుని చెత్త , చెత్తగా కొట్టేశారు..

    0
    198133

    మరో అరగంటలో పెళ్ళికి ముహూర్తం ఉందనగా , పెళ్ళికొడుకుని డైనింగ్ హలో చెత్త చెత్తగా కొట్టేశారు.. కొట్టడమంటే అట్టా ఇట్టా కాదు.. దొరికినవాడు దొరికినట్టు బాదిపారేసారు.. కింద పడదోసి ఈడ్చేసారు.. ఇంతకీ పాపం పెళ్ళికొడుకుని ఎందుకు కొట్టారో తెలుసా..? పెళ్ళికి గంట ముందు అదనంగా మూడు లక్షలు కట్నం , డైమండ్ ఉంగరం అడిగాడు. తీసిచ్చారు.. మళ్ళీ ఏమి దురాశ పుట్టిందో , మా నాన్న ఇంకో 12 లక్షలు అడగమన్నాడు, ఆ దడ్డు ఇవ్వండి , లేదంటే పెళ్లి జరగదు అనిచెప్పేసాడు. అమ్మాయితరఫున బంధువులు , చాలాసేపు చెప్పి చూసారు.. కానీ పెళ్ళికొడుకు , అతని తండ్రి వినలేదు. ఇంతలో మరో విషయం తెలిసింది. ఇదివరకే వీడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని , ఆ విషయం దాచిపెట్టి నాటకం ఆడుతున్నాడని.. దీంతో ఆగ్రహించిన పెళ్లికూతురు తరపు బంధువులు , డైనింగ్ హాల్లోనే భోజనం చేస్తున్న వాడిని లేపి , ఫుట్ బాల్ ఆడేశారు.. చివరకు పోలీసులొచ్చి మోసపు పెళ్ళికొడుకుని అరెస్ట్ చేసి తీసుకేళ్ళారు.. ఘజియాబాద్ జిల్లా షాహిబాబాద్ లో జరిగిందీ ఘటన..

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.