దేశవ్యాప్తంగా హిజ్రాలకు, సెక్స్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి ఓ ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీన్ని అన్ని రాష్ట్రాల్లోనూ స్పెషల్ క్యాంపులు పెట్టి నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ పై సాధారణ ప్రజల్లోలాగా హిజ్రాలు, సెక్స్ వర్కర్లలో కూడా కొన్ని సందేహాలున్నాయి.
అందుకని వ్యాక్సినేషన్ కు వారు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ పై వారిలో అవగాహన పెంచి, ప్రత్యేక కేేంద్రాలను పెంచి, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం, వాళ్లు కొవిడ్ క్యారియర్లు కావడమే. వివిధ రకాలైన వృత్తులు, అభిరుచులతో హిజ్రాలు విస్తృతంగా ప్రయాణాలు చేస్తుంటారు, తిరుగుతుంటారు.
అందువల్ల వీరికి వ్యాక్సినేషన్ అనేది అత్యవసరం. ఇతరులకు సోకకుండా చేసే ఒక ప్రధానమైన సాధనం కూడా. విదేశాల్లో కూడా హిజ్రాలకు వ్యాక్సినేషన్ వేయడంలో ముందుగానే అత్యథిక ప్రాధాన్యం ఇచ్చారు. వారినుంచి ఇతరులకు సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు.
సెక్స్ వర్కర్ల పరిస్థితి కూడా ఇదే. మన దేశంలో 2వారాల క్రితమే హిజ్రాలకు, సెక్స్ వర్కర్లకు అత్యవసరంగా వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరాన్ని గుర్తించి, అన్ని రాష్ట్రాలు దానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాయి. అయినా ఇప్పటి వరకు 15శాతాన్ని మించి ఆ వర్గాలు వ్యాక్సినేషన్ కు ముందుకు రావడంలేదన్నది అంచనా.
ఇవీ చదవండి..
లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?
వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.
అందాల రాసి రాశీఖన్నా ఓ సైకో అట..
కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..