రేంజ్ రోవర్ కారులో 3 ఖండాలు దాటేశాడు .

  0
  182

  ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది. గతంలో ఖండంతరాలు దాటాలంటే విమానం లేదా సముద్ర ప్రయాణాలే శరణ్యం. కానీ ఇప్పుడు అలా కాదు కొందరు సాహసికులు కార్లలోనే ఖండాంతరాలు దాటేసి వస్తున్నారు. ఇటీవల లండన్ లో ఓ వ్యక్తి తన ఫోర్డ్ ట్రక్ లో ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడే కొన్ని రోజులు తన పూర్వీకుల ఇంట్లో గడిపి మళ్లీ లండన్ కి ఫోర్డ్ ట్రక్కులోనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరో ఎన్నారై ఏకంగా కెనడా నుంచి ఇండియాకు రేంజ్ రోవర్ కార్లో వచ్చేసాడు.

  దాదాపు 32 వేల కిలోమీటర్లు దూరం సునాయాసంగా ప్రయాణించి 30 దేశాల గుండా ఇండియాకు చేరుకున్నాడు. ఆర్యన్ రాహుల్ యదువంశీ అనే ఎన్నారై ఇమ్మిగ్రేషన్ శాఖలో పనిచేస్తున్నాడు. అతడికి తన పూర్వీకులను కారులో వచ్చి చూడాలన్న కోరిక కలిగింది. వెంటనే తన కారులో కెనడా లో 15 వందల కిలోమీటర్లు ప్రయాణంచేసి , పడవ ద్వారా కారుని లండన్ కి చేర్చాడు. అక్కడి నుంచి 30 దేశాల గుండా భారతదేశానికి చేరుకున్నాడు.

  ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి కావడంతో సెలవులు దొరకడం చాలా కష్టం . దీంతో అతడు తన కారుకే టిపీ లింక్ రవుటర్ అమర్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే కారులో నుంచే తన ఆఫీస్ పని చేయడం మొదలు పెట్టాడు. తనకు తోడుగా ఒక స్నేహితుని కూడా తెచ్చుకున్నాడు. చివర్లో పాకిస్తాన్లోని వాగా బార్డర్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించారు . ఈ ప్రవాస భారతీయుడు కెనడా పౌరసత్వం కలిగిన వాడు కావడంతో పాకిస్తాన్ కూడా కెనడా వాసులకు పెద్ద అభ్యంతరం చెప్పదు. సాహసం చేయరా డింభకా అన్నట్టు , ఈ ప్రవాస భారతీయుడు కారులోనే , మూడు ఖండాలు, 30 దేశాలు దాటి , తన పూర్వీకుల గడ్డపై కాలుపెట్టాడు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here