ప్రపంచ పాముల దినోత్సం..ఇవి మీకు తెలుసా..?

    0
    214

    ఈరోజు (16-07)అంత‌ర్జాతీయ పాముల దినోత్స‌వం. పాముల గురించి తెలియ‌ని ఎన్నో విష‌యాలున్నాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో పాముల పాత్ర కూడా ఎంతో విలువైన‌ది. భూమి మీద 3500 ర‌కాల పాములు ఉంటే 600 ర‌కాల పాములు మాత్ర‌మే విష‌పూరిత‌మైన‌వి. అన్నిటి కంటే అతి పెద్ద‌ది కింగ్ కోబ్రా. గుడ్లు పెట్టేందుకు త‌న‌కు తానుగా ఒక స్థావ‌రం ఏర్పాటు చేసుకునే పాముల్లో నాగుపాము ఒక్క‌టే.

    ఎగిరే పాములు అంటే అవి ప‌క్షుల్లాగా ఎగ‌ర‌లేదు. చెట్లపై నుంచి కింద‌కి మాత్ర‌మే దూక‌గ‌ల‌వు. ఈ సంద‌ర్భంగా అవి త‌మ శ‌రీరం కింద గాలిని బంధించి అవి కింద‌కు దూకేస్తాయి. పాముల‌కు చెవులు ఉండ‌వు. అయితే కింద ద‌వ‌డ భాగంలో ఉన్న ప్ర‌త్యేక ఇంద్రియాల ద్వారా భూమి మీద‌, నీటిలో వ‌చ్చే శ‌బ్దాల‌ను గ్ర‌హిస్తాయి. పొట్ట అడుగుభాగంలో ఉండే పొలుసుల ద్వారా పైకి సుల‌భంగా పాక‌గ‌ల‌వు. పాములు త‌మ‌లోని విషాన్ని ఆహారాన్ని జీర్ణం చేసుకోవ‌డానికి వినియోగిస్తాయి.

    న‌రాల బ‌ల‌హీన‌త కండ‌రాల బ‌ల‌హీన‌త మ‌రియు నొప్పుల కోసం పాముల నుంచి విషం నుంచి తీసిన ఎంజైములను కొన్ని వ్యాధుల‌కు మందుల్లో వాడుతారు. ర‌క్త‌పింజ‌రులు వంటి కొన్ని అతిత‌క్కువ‌ పాములు మాత్ర‌మే గుడ్లు పెట్ట‌కుండా పిల్ల‌ల‌ను కంటాయి. పాముల‌కు ధ‌ర్మోసెన్స‌ర్లు ఉంటాయి. అతిచిన్న ప్రాణుల నుంచి వెలువ‌డే వేడిని గ్ర‌హించి, అవి దాడి చేస్తాయి. పాములు త‌మ నాలుక ద్వారా వాస‌న చూస్తాయి.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.