మా ఎన్నికల్లో ఏకగ్రీవానికి నో – పోటీకి సై..

    0
    457

    ‘మా’ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. తెలంగాణ ప్ర‌భుత్వంతో, సీఎం కేసీఆర్ తో రాసుకుని పూసుకుని తిరేగే సినీ పెద్ద‌లు, మా భ‌వ‌నం కోసం ఒక్క ఎక‌రం కూడా సంపాందించ‌లేక‌పోయారు… ‘మా’ కోసం శాశ్వత భవనం అజెండాతో ముందుకు వచ్చిన మంచు విష్ణుకు మద్దతు ఇస్తున్నానంటూ నిన్న బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం చేపాయి. ఒక‌ర‌కంగా ఆయ‌న చిరంజీవి, నాగార్జున‌ల‌ను ఉద్దేశించి చేసిన‌వే అని చెప్పుకుంటున్నారు. దీనిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

    ‘మా’కు గతంలో అధ్యక్షుడిగా పోటీ చేసిన మురళీమోహన్ పోరాటం చేసి ఉంటే ఎప్పుడో శాశ్వత భవనం సాకారమయ్యేదని అభిప్రాయపడ్డారు. గతంలో ‘మా’కు నాయకత్వం వహించినవాళ్లు భవనం విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇప్పుడు మంచు విష్ణు వచ్చి శాశ్వత భవనం నిర్మిస్తామంటున్నారని, అసలు ఆయనకు స్థలంపై ఏం స్పష్టత ఉందని నాగబాబు ప్రశ్నించారు. అన్ని అంశాల్లో స్పష్టత ఉంది కాబట్టే తాము ప్రకాశ్ రాజ్ కు మద్దతిస్తున్నామని తెలిపారు. ఏకగ్రీవం అంశాన్ని తాము ఆమోదించబోమని, అభ్యర్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటామని చెప్పారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.