అన్నీ మంచంలోనే.. అయినా ఆమెకు అదో తృప్తి..

  0
  72

  ఆమధ్య కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటి, బిగ్ బాస్ ఫేమ్ యషికా ఆనంద్ చెప్పిన మాటలు వింటే ఎవరికైనా ఆమెపై సానుభూతి కలగదు, ఒళ్లు మండుతుంది. అవును, యషిక తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ మేటర్ షేర్ చేసింది. తన ప్రస్తుత స్థితిని కళ్లకు కట్టింది.
  నాకు నడుం విరిగింది, వెన్ను నొప్పిగా ఉంది, శరీరం నుజ్జు నుజ్జయింది, యూరిన్ కూడా మంచంలోనే.. సంతోషించే విషయం ఏంటంటే.. నా మొహానికి ఏమీ కాలేదు అంటూ ముక్తాయించింది.

   

  View this post on Instagram

   

  A post shared by Y A S H ⭐️?? (@yashikaaannand)

  గత నెల 24న చెన్నైలో జరిగిన ప్రమాదంలో యషిక నడుపుతున్న కారు ఓ మహిళను ఢీకొంది. ఈ ప్రమాదంలో రోడ్డుపై నడచి వెళ్తున్న మహిళ అక్కడికక్కడే చనిపోయింది. అయితే యషికకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం లేకపోయినా యషిక ఇప్పుడల్లా కోలుకునేలా లేదు. మరికొన్నాళ్లు ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు వైద్యులు. ప్రస్తుతం తన పరిస్థితి గురించి యషిక సోషల్ మీడియాలో ఇలా అభిమానులకు అప్ డేట్లు ఇస్తోంది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.