విశ్వాంతరాళంలో అద్భుతాలకు కొదవ లేదు. ఎన్ని కోట్ల సంవత్సరాలు పరిశోధనలు చేసినా ఇంకా మిగిలే వుంటాయి. అంతటి విశ్వ రహస్యాలు తెలిసే కొద్దీ అద్భుతాలే. అంతరిక్ష ప్రయోగశాలలో ఉన్న వ్యోమగాములు ఒక్కరోజులో ఎన్ని చంద్రాస్తమయాలు, ఎన్ని చంద్రోదయాలు చూస్తారో మీకు తెలియదు. 24 గంటల్లో అంతరిక్షంలోని శాస్త్రవేత్తలు 16 చంద్రోదయాలు, 16 చంద్రాస్తమయాలు మొత్తం 32 సార్లు .. ఈ రెండు అద్భుతాలను చూస్తారు. భూమిని చుట్టి వచ్చే అంతరిక్ష వాహకనౌకలో నుంచి చంద్రుడు, సూర్యుడు అస్తమయాలు.. పునః దర్శనాలు నిమిషాల వ్యవధిలోనే చూస్తుంటారు. అంటే దాదాపు ఎప్పుడూ చంద్రుడిని చూస్తూనే అంతరిక్ష వాహక నౌక పరిభ్రమిస్తుంటుంది. నాసా అంతరిక్ష వాహననౌక నుంచి నిత్యం విశ్వాన్ని చూసే ఆ వ్యోమగాముల జీవితం నిజంగా సార్ధకం. ఈ సందర్భంగా అంతరిక్ష వాహక నౌక నుంచి తీసిన నిత్య చంద్రోదయం, నిత్య చంద్రాస్తమయం వీడియోను చూడండి.
— Seán Doran (@_TheSeaning) July 20, 2019