కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  0
  1117

  కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. సామాన్యులకు చెంపదెబ్బలు, చేతి దెబ్బలు తప్పవు. ఆమధ్య ఓ పెళ్లిలో నిబంధనలు పాటించట్లేదని త్రిపుర రాష్ట్రంలోని కలెక్టర్ పెళ్లి కొడుకుని చితగ్గొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ బాధలన్నీ సామాన్యులకే. అధికారులకు వీటినుంచి మినహాయింపు ఉంది. కావాలంటే మీరే చూడండి. ఈ లేడీ తహశీల్దార్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. తమ్ముడి పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో.. తహశీల్దార్ చిందులేశారు. ఆమెతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ విందుకు ప్రత్యేక అతిథులుగా వచ్చి కొవిడ్ నిబంధనలు పాతరేసి ఆడిపాడారు. మాస్కులు లేకుండా, సామాజిక దూరం లేకుండా వీరు చేసుకున్న ఈ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఈమె పేరు బుల్ బుల్ బెహరా. ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలో సుకింద మండల తహశీల్దార్ ఆమె. ఆమె తమ్ముడి పెళ్లి మే21 న జగన్నాథ్ పూర్ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బుల్ బుల్ సహా చాలామంది చిందులేశారు. ఎవ్వరికీ సరిగ్గా మాస్కులు లేవు, సామాజిక దూరం అసలే లేదు. సామాన్యుల పెళ్లిళ్లకు సవాలక్ష కండిషన్లు పెట్టే అధికారులు, తమకి కావాల్సిన వారి పెళ్లిళ్లలో మాత్రం ఇలా నిబంధనలు వదిలేసి డ్యాన్స్ లు ఆడతారనమాట.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు