ఎంత పనిచేశావురా ప్రియుడా..??

  0
  444

  వీడి అతితెలివి వాడిని పట్టించింది… మరో వ్యక్తితో పెళ్లి కాబోయే ప్రియురాలిని కలుసుకోవాలని, చివరగా ఒక మాట చెప్పుకోవాలని పాపం, ఆ భగ్న ప్రేమికుడు భావించాడు. అనుకున్నదే తడవుగా ఫ్రెండ్స్ తో ప్లాన్ చేశాడు.. పెళ్లి ముహూర్తం గంటల్లోనే ఉంది.. దీంతో ముందు జాగ్రత్తగా, ప్రియుడు అమ్మాయిలాగా వేషం కట్టాడు. కొత్త చీర, జాకెట్, అమ్మాయి మాదిరి విగ్గు, జడనిండా పూలు, చేతులకు గాజులు, మెడలో దండలు… ఇలా పెళ్లికూతురు గెటప్ కంటే ఎక్కువగా మేకప్ చేసుకున్నాడు.

  నేరుగా పెళ్లింటికి వచ్చేసి కులుకుతూ పెళ్లికూతురు గదిలోకి పోతుండగా బంధువులకు ఎందుకో అనుమానం వచ్చి ఆపి, ఎవరని అడిగితే తడబడ్డాడు.. దీంతో అనుమానం ఎక్కువై, విగ్గు ఊడబీకారు.. దీంతో గందరగోళం జరిగింది.. హడావుడిలో వాళ్ళ పట్టు నుంచి తప్పించుకొని పారిపోయాడు.. బయటే వెయిటింగ్ లో ఉన్న  ఫ్రెండ్స్ బైక్ పై తుర్రుమన్నాడు.. ఉత్తరప్రదేశ్ లోని మదోహి లో జరిగిందీ ఘటన…నవ్వు పుట్టించే ఈ వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..