ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    0
    3200

    మతమేదైనా, మృత్యువు దగ్గరకు వస్తుందని తెలిసినప్పుడు దేవుడ్ని ప్రార్థిస్తారు. దైవ చింతనలో దేహం వదిలేయాలని చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో తన మతం కాకపోయినా, ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో దేవుడి నామాన్ని స్మరించి ప్రశాంతంగా దేహం చాలించేందుకు సహకరించింది. కేరళలో డాక్టర్ రేఖా కృష్ణన్, పాలక్కాడ్ పట్టంబి ఆస్పత్రిలో బీవతు అనే 56ఏళ్ల ముస్లిం మహిళకు కొవిడ్ వైద్యం చేస్తోంది.

    బీవతుకు తన అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని అర్థమైంది. డాక్టర్ ని పిలిచి తాను చనిపోతున్నాను కదా అని అడిగింది. షాదత్ ఖలీమా చదవమని కోరింది. ఆమె విన్నపాన్ని మన్నించిన డాక్టర్ రేఖా కృష్ణన్, బీవతు బెడ్ పక్కనే ఉండి ఖలీమా చదవింది. ఆమె ఖలీమా చెవిలో చెబుతుండగానే, బీవతు ప్రాణం గాల్లో కలిసిపోయింది. బీవతు తనను కూతురిలాగా భావించేదని, ముందుగానే తాను చనిపోయేటప్పుడు షాదత్ ఖలీమా చెప్పమని కోరిందని, అప్పుడే తాను తెలుసుకున్నానని రేఖా కృష్ణన్ చెప్పారు.

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు