ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  0
  5691

  ఆన్ లైన్ క్లాసుల్లో సెక్సువల్ హరాస్ మెంట్స్ ఉంటాయా..? అనుమానం అక్కర్లేదు. ఆన్ లైన్ క్లాసుల్లో చెన్నైలో జరిగే సెక్సువల్ హరాస్ మెంట్స్ గురించి సినీ హీరోయిన్లు గగ్గోలు పుట్టించేశారు. చెన్నైలో ప్రముఖ స్కూల్ కి సంబంధించి ఆన్ లైన్ క్లాసుల్లో టీచర్లు ఆడపిల్లల్ని ఎలా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారో తెలియజేసే సంఘటన ఇది. మొదటగా క్రిపాలి అనే మోడల్ పెట్టిన పోస్టింగ్ లను, సింగర్ చిన్మయి షేర్ చేసింది. దీంతో హీరోయిన్ లక్ష్మీప్రియ, మహిళా నిర్మాత అర్చన కల్పతి ఈ పోస్టింగ్ లు షేర్ చేస్తూ కీచక టీచర్ల వ్యవహారాన్ని బయటపెట్టారు.

  చెన్నైలో పీఎస్బీబీ (కెకెఎన్) స్కూల్ కి మంచి పేరుంది. ఈ స్కూల్ లో కామర్స్, అకౌంట్స్ చెప్పే రాజగోపాలన్, రమేష్ ప్రభ.. ఆడపిల్లల్ని ఆన్ లైన్ లో వేధిస్తున్నారని తేలింది. అందరు ఆడపిల్లలే ఉన్న ఈ ఆన్ లైన్ క్లాస్ లో టీచర్లు దుస్తులు లేకుండా టవల్ చుట్టుకుని, అప్పుడప్పుడూ టవల్ తీసేస్తూ.. మళ్లీ కట్టుకుంటూ.. ఇలా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తేలింది. దీంతో ఈ స్కూల్ లో చదువుకున్న పాత విద్యార్థులు కూడా అక్కడ లైంగిక వేధింపులు ఎలా ఉంటాయో కొంతమంది టీచర్లు, అనవసరంగా అమ్మాయిల మీద చేతులు వేయడం, కౌగిలించుకోవడం, ఎలా చేస్తారో వివరిస్తూ ఇప్పుడు పోస్టింగ్ లు పెడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం సంచలనం అయింది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు