స్టూడెంట్స్ ని బయటకు పంపి లేడీ టీచర్ల డాన్సులు..

  0
  1662

  సోషల్ మీడియా పిచ్చిలో ఆస్పత్రి అయినా, స్కూల్ అయినా, ప్రభుత్వ కార్యాలయాలు అయినా.. మహిళా ఉద్యోగులు డ్యాన్స్ లు వేస్తూ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఆగ్రాలోని ఓ స్కూల్ లో హెడ్మాస్టర్ తో సహా ఐదుగురు టీచర్లు, పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి ఇలా డ్యాన్స్ లు వేస్తూ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అధికారుల దృష్టికి సోషల్ మీడియా వీడియో పోవడంతో వెంటనే అందర్నీ సస్పెండ్ చేశారు. సినిమాలోని పాటలకు క్లాస్ రూమ్ లో పిల్లలందర్నీ బయటకు పంపించేసి ఈ టీచర్లు ఇలాగే డ్యాన్స్ లు వేసుకుంటుంటారని విద్యార్థులు చెప్పారు. రష్మి సిసోడియా, జివికా కుమారి, అంజలి యాదవ్, సుమన్ కుమారి, సుధా రాణి అనే వీరంతా తాజాగా ఒక హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ ఇలా దొరికిపోయారు. ఆ ఐదుగురిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. గతంలో కూడా ఈ స్కూళ్లలో టీచర్లు ఇలాగే చేస్తే సస్పెండ్ చేసి, బదిలీ చేశారు. వీళ్లు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.