పులినోట్లో తలబెట్టినందుకు ఆమెకు ప్రమోషన్

  0
  7369

  పరమ కిరాతకుడైన మాఫియా నేత రోహిత్ చౌదరిని అరెస్ట్ చేసిన కేసులో మహిళా ఎస్సై ప్రియాంక ఖాత్రికి ప్రమోషన్ ఇచ్చారు.. ఎన్నో హత్యకేసులు , కిడ్నాప్ , డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్న రోహిత్ చౌదరిని అరెస్ట్ చేసేందుకు కొన్నేళ్లుగా పోలీసు ప్రయత్నాలు చేస్తోంది.. అతడిని చంపినా , పట్టిచ్చిన 4 లక్షల రూపాయల బహుమతికూడా పోలీసు శాఖ ప్రకటించింది. గత రెండేళ్లుగా అతడిని వెంటాడేందుకు మహిళా ఎస్సై ప్రియాంక ఖాత్రి ఆధ్వర్యంలో ఎన్ కౌంటర్ టీమ్ ఒకటి ఏర్పాటైంది.

  ఢిల్లీ ప్రగతి మైదాన్ లో రోహిత్ చౌదరి ఒక దఃస్య స్థావరంలో ఉన్నాడని తెలిసి , పులినోట్లో తలబెట్టినట్టు , తానే అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్ళింది.. ఈ సందర్భంగా రోహిత్ చౌదరి గ్యాంగ్ ఆమెపై కాల్పులు జరిపింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు బులెట్ ప్రూఫ్ జాకెట్ ఉండటంతో తప్పించుకొని , రోహిత్ చౌదరి , అతడి అంగరక్షకులపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపింది. కాల్పుల్లో గాయపడ్డ వారు లొంగిపోయారు.. ఇప్పుడు ఆమె సాహసానికి గుర్తింపు లభించింది. ఆమెకు ప్రమోషన్ ఇచ్చారు.. ఈ అరెస్ట్ లో పాల్గొన్న ఇతర పోలీసులకూ ప్రమోషన్లు , క్యాష్ రివార్డులు ఇచ్చారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..