కేటీఆర్ మెచ్చారు, అమ్మాయిని అదృష్టం వరించింది

  0
  144

  తెలంగాణకు చెందిన శ్రావణి అనే ఓ అమ్మాయి పాడిన పాట మంత్రి కేటీఆర్ కి బాగా నచ్చింది. ఇంకేముంది ఆ అమ్మాయి ప్రతిభను పొగిడేసిన మంత్రి, పనిలో పనిగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ కి ఆ పాటను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. దీంతో ఆ అమ్మాయికి అదృష్టం వరించింది. స్వయంగా దేవిశ్రీ, తమన్ ఆమె పాట బాగుందంటూ స్పందించారు. అంతే కాదు తమ మ్యూజిక్ ట్రూప్ లో జానయ్ చేసుకుంటామని హామీ ఇచ్చారు.

  ఎవరీ శ్రావణి..?
  సురేంద్ర తిప్ప‌రాజు అనే ఓ నెటిజ‌న్.. శ్రావణి టాలెంట్ ని సోషల్ మీడియాకు పరిచయం చేస్తూ మంత్రి కేటీఆర్‌ ని మెన్షన్ చేస్తూ ట్వీట్ చేశారు.
  “మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావ‌ణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయ‌ని స్వ‌రం మైమ‌రిపించేలా ఉంది. ఆమె ట్యాలెంట్‌కు మీ స‌హ‌కారంతో పాటు మీ ఆశీస్సులు అవ‌స‌రం” అంటూ కేటీఆర్‌ కు తిప్ప‌రాజు ట్వీట్ చేశారు. “రేలా రే రేలా రే నీళ్ల‌ల్లో నిప్ప‌లే వ‌చ్చింది నిజ‌మ‌ల్లే.. ప‌డిలేచి నిలిచే ర‌ణ‌ములో నా తెలంగాణ” అనే పాట‌ను శ్రావ‌ణి ఆల‌పించ‌గా.. ఆ వీడియోను కూడా తిప్ప‌రాజు ట్వీట్ చేశారు.

  ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. శ్రావ‌ణిలో అద్భుత‌మైన ట్యాలెంట్ ఉందంటూ ప్ర‌శంసించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్లు థ‌మ‌న్, దేవీ శ్రీప్ర‌సాద్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. దీనిపై ఆ ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు కూడా స్పందించారు. శ్రావ‌ణి అద్భుత‌మైన గాయ‌ని అని థ‌మ‌న్ మెచ్చుకున్నారు. దేవీ శ్రీప్ర‌సాద్ స్పందిస్తూ నిజంగా ఆమె స్వ‌రం అద్భుతంగా ఉంది. ప్ర‌తిభావంతురాలిని త‌మ దృష్టికి తీసుకొచ్చినందుకు కేటీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. శ్రావ‌ణి ట్యాలెంట్‌ను త‌ప్ప‌కుండా గౌర‌విస్తామ‌న్నారు. తాము భ‌విష్య‌త్‌లో నిర్వ‌హించే షోల‌లో శ్రావ‌ణికి త‌ప్ప‌కుండా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని దేవీ శ్రీప్ర‌సాద్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..