వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  0
  5632

  ప్రపంచంలో దారుణ మారణహోమం సృష్టించిన కరోనా వైరస్ పుట్టుక చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే అన్నది ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. దీనికి రకరకాల ఆధారాలు, సమీకరణాలు, అనుమానాలతో నివేదికలు తయారు చేస్తున్నారు. చైనా మాత్రం వీటన్నిటినీ ఖండిస్తోంది. గతంలో ఓ దశలో వుహాన్ ల్యాబ్ పరిశోధనల్లో కరోనా వైరస్ రకాలను పరీక్షించే క్రమంలో పొరపాటున కొవిడ్ 19 వైరస్ బయటకొచ్చిందన్నది మొదట్లో జరిగిన ప్రచారం. గబ్బిలాలపై పరిశోధన చేస్తుండగా ఇది జరిగిందన్న వాస్తవం అందరూ ఒప్పుకుంటున్నదే. దీన్ని చైనా కాదంటున్నా ఇప్పుడు ఒక తిరుగులేని సాక్ష్యాన్ని అమెరికా గూఢచార వ్యవస్థ బయటపెట్టింది.

  వుహాన్ ల్యాబ్ లో బ్రతికి ఉన్న గబ్బిలాల వీడియోని బయటకు తెచ్చారు. వుహాన్ ప్రయోగశాలలో ఒక రహస్య గదిలో ఈ గబ్బిలాలున్నాయి. వీటిమీద చేస్తున్న పరిశోధనల కారణంగానే కరోనా వైరస్ ఒక జీవాయుధంగా బయటపడింది. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు మొదటగా దీన్ని గుర్తించారు. ల్యాబ్ లలో కొన్ని బోన్లలో పెట్టిన ఈ గబ్బిలాలను ముందు ఫొటోలు తీశారు. ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సహకారంతో నేరుగా వీడియోలే బయటకొచ్చాయి. దీంతో ఈ నిజాన్ని కాదనలేని పరిస్థితి.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..