లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    0
    5947

    మహిళలు విమానాలు నడపొచ్చు, యుద్ధాలు చేయొచ్చు, అంతరిక్షంలోకి వెళ్లొచ్చు.. ఇవన్నీ ఒకెత్తయితే లారీ డ్రైవర్ గా పనిచేస్తూ రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఒంటరిగా కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు సరకులు చేరవేసే ఓ మహిళ చరిత్ర నిజంగా అద్భుతం. లారీ డ్రైవర్లుగా మగవాళ్లను చూస్తేనే ఇంత కష్టమైన పనుల్ని ఎలా చేస్తారా అనిపిస్తుంది. అలాంటిది, న్యాయశాస్త్రం చదివి, లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న యోగితా రఘువంశీ చరిత్ర గొప్పది.

    అందుకే ఆమె ఇంటర్నేషన్ల్ వుమన్ డ్రైవర్ అయింది. రాత్రులు రోడ్డుపక్కన లారీ ఆపుకొని తనే వంట చేసుకుని, లారీ టైరు పంక్చర అయినా తనే స్టెపినీని మార్చుకోవడం, వందల కిలోమీటర్లు అలసట లేకుండా లారీని నడిపి సరకులు చేరవేయడం, ఇన్ని పనుల్లో రఘువంశీ ఆరితేరిపోయారు.

    మహారాష్ట్రలోని నందర్బార్ కి చెందిన యోగిత డిగ్రీ చదివిన తర్వాత లా కూడా చదివి ఉత్తీర్ణురాలైంది. 16ఏళ్ల క్రితం భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసింది. అయితే ఆ రంగంలో తనకు పూట గడవదని భావించి జీవితంలో స్థిరంగా నిలదొక్కుకోవాలంటే ఇంతకంటే మంచి పనిలో చేరాలని భావించింది. అందుకే లారీ డ్రైవింగ్ నేర్చుకుని, మహిళా లారీ డ్రైవర్ గా స్థిరపడింది. ఆమె లారీ డ్రైవర్ గా వృత్తి చేపట్టేనాటికి పిల్లలిద్దరూ చిన్నవారే.

    మొట్టమొదటి సారిగా ఆమె తన లారీలో సరకులతో బాంబేనుంచి అహ్మదాబాద్ కి వెళ్లి, ఆ తర్వాత ఇక తన లారీ డ్రైవర్ గా తన ప్రయాణాన్ని అలాగే కొనసాగించింది. ఇప్పటి వరకు దేశంలో ఆమె తిరగని ప్రాంతం లేదు, సరకులు చేరవేయని ప్రదేశం లేదు. రాత్రి సమయంలో డాబాల వద్ద లారీ ఆపుకొని పడుకునేటప్పుడు తనకి ఇబ్బందులు దాదాపుగా ఎదురు కాలేదని సాటి డ్రైవర్లు కూడా సోదరిగానే భావిస్తుంటారని చెప్పేది.

    తాను లారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఎంతో కొంత సహకరిస్తారని కూడా తెలిపేది యోగిత. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన దారిన తాను పోతానని తన లారీ డ్రైవర్ జీవితాన్ని తెలుసుకున్న చాలామంది మహిళలు ఆ తర్వాత లారీ డ్రైవర్లుగా మారి, కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. సాహసాలు చేయడం తనకు ఇష్టమని, లారీ డ్రైవర్ గా ప్రతి రోజూ తనకు సాహసమేనని అయితే తన విశ్వాసమే తనను ముందుకు నడిపించిందని అన్నారు.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..