గ్రాండ్ గా ఓ మహిళ విడాకుల పార్టీ..

  0
  143

  పెళ్లిరోజు , పుట్టిన రోజు ఇలాంటి ఫంక్షన్లు మామూలే.. అయితే ఇప్పుడో మహిళ ఏకంగా విడాకుల పార్టీ ఘనంగా చేసింది.. సోనియాగుప్త అనే మహిళ పెళ్ళైన 17 ఏళ్లకు విడాకులు తీసుకుంది. విడాకులు మంజూరైన రోజు , ఫ్రెండ్స్ , బంధువులను పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఫైనల్లీ డైవర్స్డ్ ..అన్న టాగ్ కూడా తగిలించుకుంది. సోనియా గుప్త 2003 లో పెళ్లిచేసుకొని లండన్ కి పోయింది.

  తనకు ఇండియాలో పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగిందని అన్నారు. పెళ్ళైన తర్వాత స్వేచ్ఛ కోల్పోయానని చెప్పింది. పెళ్ళికి ముందు పబ్ లు , క్లబ్బుల్లో హ్యాపీగా గడిపేదానినని , పెళ్లితో అన్నీ బంద్ అయిపోయాయని చెప్పింది. సాంప్రదాయాలు , కట్టుబాట్లు పేరుతో తాను సంసారంలో చిక్కుకుపోయానని ఉపన్యాసం ఇచ్చింది. పెళ్ళైన వాళ్లకు విడాకుల తర్వాతనే జీవితం మొదలవుతుందని చెప్పింది. ఇప్పుడే ఇక తన హ్యాపీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.