తుపాకీతోనే జీవితం – దానితోనే అంతం..

    0
    7862

    ఢిల్లీలోని రోహిణీ కోర్టులో జ‌రిగిన గ్యాంగ్ వార్ భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించింది. సినీఫ‌క్కీలో జ‌రిగిన ఈ వార్ వెన‌క అస‌లు క‌ధేంటి ? కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చి మ‌రీ ఫైరింగ్ ఎందుకు జ‌ర‌పాల్సి వ‌చ్చింది ? అస‌లు ఈ గ్యాంగ్ లు ఎందుకు త‌ల‌ప‌డుతున్నాయి ? జితేంద్ర గోగి. గ్యాడ్యుయేట్ కంప్లీట్ చేశారు. ఇత‌ని తండ్రి మేహ‌ర్ సింగ్. ఆయ‌న కూడా క్రిమిన‌ల్. తండ్రి చ‌నిపోయాక ఈ దారిలోకి వ‌చ్చాడు జితేంద్ర‌. ఎన్నో దోపిడీలు, దొంగ‌త‌నాలు, మ‌ర్డ‌ర్లు చేసి పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. చోటా రాజ‌న్ లాగా మాఫియా డాన్ కావాల‌న్న‌ది అత‌ని కోరిక‌. ఇప్ప‌టికే అత‌నిపై 19 మ‌ర్డ‌ర్ కేసులు ఉన్నాయి. మోస్ట్ వాటెండ్ క్రిమిన‌ల్స్ లో ఒక‌డిగా జితేంద్ర పోలీసు రికార్డుల్లో రిజిస్ట‌ర్ అయ్యాడు. మ‌రోవైపు టిల్లు సునీల్ గ్యాంగ్ కూడా ఇదే త‌ర‌హాలో దోపిడీలు, బ్లాక్ మెయిలింగులు, మ‌ర్డ‌ర్లు చేస్తూ ఉంది.

    దీంతో ఈ రెండు గ్యాంగ్ ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతోంది. ఢిల్లీ యూనివ‌ర్శిటీ స్టూడెంట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈ వైరం మ‌రింత ముదిరింది. అప్ప‌టి నుంచి ప్ర‌త్య‌ర్ధి వ‌ర్గంలోని ఎవ‌రూ క‌నిపించినా తూటాలు పేలేవి. ర‌క్తం ధారలై పారేవి. దీంతో పోలీసులు వీరిపై క‌న్నేసి ఉంచారు. 2016లో పోలీస్‌ కస్టడీ నుంచి జితేంద్ర త‌ప్పించుకున్న సంద‌ర్భం కూడా ఉంది. గ‌తేడాది పోలీసులు జితేంద్ర‌ని అరెస్టు చేసి తీహార్ జైలుకి పంపారు. ఇక టిల్లూ కూడా సోనీప‌ట్ జైలులో ఉన్నాడు. ఆలీపూర్, సోనీప‌ట్ ప్రాంతాల్లో వీరి దౌర్జ‌న్యాలు కొనసాగించి, చివ‌రికి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. జైలులో ఉన్నా కూడా త‌న అనుచ‌రుల‌తో త‌మ‌ నేర‌వృత్తిని కొన‌సాగించారు. తాజాగా జ‌రిగిన టిల్లూ గ్యాంగ్ కాల్పుల్లో జితేంద్ర హ‌త‌మ‌య్యాడు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.