మీ భార్య ఫోన్ చూస్తుంటే.. కోప్పడుతున్నారా..వద్దు.. మీ మంచి కోసమే చెబుతున్నా..
మొబైల్ ఫోన్ వచ్చాక వాట్సాప్ చాటింగులు, మీటింగులు ఎక్కువగా ఎక్కువైపోయాయి.. ఈ చాటింగులు ఎన్నో సంసారాల్లో చిచ్చు పెట్టాయి, పెడుతున్నాయి కూడా.. ఇప్పటికే భార్యా భర్తల మధ్య ఈ మొబైల్ ఫోన్ వచ్చి చేరింది. పెళ్ళాం పక్కన ఉన్నాసరే.. కొందరు మగాళ్లకు సెల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే.. అలాగే కొందరు పెళ్ళాలు కూడా తయారయ్యారు. మొగుడుని గాలికొదిలేసి.. ఎప్పుడూ ఫోన్లపైనే ద్రుష్టి పెడుతున్నారు. భర్తలకు వండిపెట్టే పని కూడా మరచిపోయి.. సెల్ ఫోన్ తోనే సంసారం చేస్తున్నారు నేటి కాలం ఆడాళ్ళు.. అయితే ఇలా మొబైల్ ఫోన్ కారణంగానే విడిపోయిన జంటల స్టోరీలు కూడా మనం చూస్తూనే ఉన్నాం..అయితే ఇప్పుడు మీరు తెలుసుకునే స్టోరీ ఇంకాస్త వెరైటీగా ఉంటుంది..
హిమాచల్ ప్రదేశ్ లోని థియోగ్ అనే గ్రామంలో ఓ మహిళ నిత్యం వాట్సాప్ లో చాటింగ్ చేస్తుండేది.. కళ్ళు పాడై పోతాయని ఆమె భర్త ఎన్నోసార్లు చెప్పిచూశాడు. ఇలా చాలా రోజుల నుంచి చెప్పి చూసిన భర్త.. విసిగిపోయి, ఈ సారి గట్టిగానే మందలించాడు. దీంతో చిర్రెత్తిన ఆ భార్య.. ఏకంగా కర్ర తీసుకొని భర్త పళ్ళు రాలగొట్టింది.. దీంతో ఆ అమాయక భర్త చేసేదేమీ లేక పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాడు..ఆమె పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.. ఇదీ సంగతి.. సో ఇంకెప్పుడైనా మీ భార్యలు ఫోన్ చూస్తుంటే కోప్పడకండి.. ఎందుకైనా మంచిది.. మీ కోసమే చెబుతున్నా..
ఇవీ చదవండి..