విమానంలో పురిటినొప్పులు..అదృష్టం బాగుండి..

  0
  408

  లండన్‌ నుంచి కేరళలోని కొచ్చి వస్తున్నఎయిరిండియా విమానంలో అద్భుతం జరిగింది. లండన్ నుంచి ఐదవ తేదీన బయలుదేరిన బోయింగ్ 787 విమానం ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఉన్న ఓ మహిళకు ప్రసవ వేదన మొదలైంది. దీంతో పైలట్లు, ఎయిర్ ఇండియా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారేమో అని చూశారు. అదృష్టవశాత్తూ ప్రయాణీకుల్లో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు కూడా ఉన్నారు. వెంటనే స్పందించిన వైద్యులు ప్రసవ వేదనకు గురైన మహిళకు సాయం చేసి.. వైద్య సేవలు మొదలు పెట్టారు.

  నెలలు నిండకుండానే ప్రసవం జరిగింది. అయితే ఆమెకు మెరుగైన వైద్య పర్యవేక్షణ అవసరం కావడంతో మార్గమధ్యలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని దించేశారు. తల్లీబిడ్డలను అక్కడి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ప్యాసింజరు వీరికి తోడుగా ఉన్నారు. మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి కొచ్చికి బయలుదేరింది. వైద్య సేవల అనంతరం ఆ ముగ్గురినీ తర్వాత ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి భారత్‌కు తీసుకువస్తామని ఎయిరిండియా ప్రతినిధులు చెప్పారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.