అందమైన ప్రొఫైల్ పిక్ కి పడిపోయాడు..తర్వాత.

  0
  1019

  గుంటూరులో ఓ అమాయకుడిని బుట్టలో వేసుకుని, మాయమాటలు చెప్పి, అతనివద్ద నుంచి డబ్బులు కొట్టేసి ప్రియుడికి దోచిపెట్టింది. మధ్యలో గుంటూరుకి చెందిన రైతు సుబ్బారెడ్డి, ఇప్పుడు మోసపోయానంటూ పోలీసుల వద్ద ఏడుస్తున్నాడు. హైదరాబాద్ కి చెందిన అర్చన అనే ఓయువతి బ్యూటీ పార్లర్ నిర్వహించేది. పగలు చూస్తే, రాత్రి కలలోకి వచ్చేంత వికారంగా ఉంటుంది. అయితే తన ప్రొఫైల్ పిక్ గా సోషల్ మీడియాలో ఓ అందమైన అమ్మాయి ఫొటోను పెట్టేది. బావ సాయిరాం ద్వారా గుంటూరుకి చెందిన సుబ్బారెడ్డి అనే రైతుతో పరిచయం పెంచుకుంది. సోషల్ మీడియాలోనే చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నమ్మించింది.

  అర్చన వలలో పడ్డ సుబ్బారెడ్డి, వ్యాపారం కోసమంటూ ఏడాది కాలంగా వాయిదాలతో కోటీ 20లక్షల రూపాయలు చెల్లించాడు. విచిత్రం ఏంటంటే, అప్పటి వరకు అతను నేరుగా అర్చనని కలవడం కానీ, చూడటం కానీ వీలు కాలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. చాటింగ్ తోనే సరిపెట్టేది. సుబ్బారెడ్డి దగ్గర కొట్టేసిన డబ్బంతా ప్రియుడు అనిల్ కుమార్ తో కలసి జల్సాలు చేసేది. ప్రియుడికి కారు కొనిచ్చింది. బంగారు నగలు చేయించింది. ఇలా ఇద్దరూ కలసి సుబ్బారెడ్డి డబ్బుతో విలాస జీవితం గడిపేశారు. సుబ్బారెడ్డికి అనుమానం వచ్చి తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో చంపేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో హైదరాబాద్ లో ఆమె ఎక్కడుందో తెలుసుకున్న సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆధారాలతో సహా పోలీసులు అర్చనను, ఆమె ప్రియుడు అనిల్, బావ సాయిరాంను అరెస్ట్ చేశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..