తప్పిపోయిన పిల్ల ఏనుగును తల్లిచెంతకు చేర్చిన వేళ ..

  0
  2359

  తప్పిపోయిన బిడ్డను తల్లిదండ్రుల ఒడికి చేర్చే పోలీసులను మనం చూస్తూనే ఉంటాం.. అయితే అదే విధంగా తల్లి నుంచి అడవిలో తప్పిపోయిన ఏనుగు పిల్లకు దిక్కెవరు..? సాధారణంగా ఏనుగు తన బిడ్డ తప్పిపోతే అడవి మొత్తం దద్దరిల్లేలా ఘీమ్ కరిస్తుంది. తప్పిపోయిన ఆ బిడ్డ కోసం ఆహరం కూడా తీసుకోకుండా వెతుకుతుంది. అయితే తమిళనాడులోని నీలగిరి జిల్లా గుడలూరులో ఓ ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు నుంచి తప్పిపోయింది. ఇది గమనించిన అటవీశాఖ అధికారులు ఒక బృందంగా ఏర్పడి.. తల్లి ఏనుగు వద్దకు క్షేమంగా చేర్చారు. దీంతో పిల్ల ఏనుగు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు.. ఆ పిల్ల ఏనుగును తన తల్లి ఏనుగు వద్దకు చేర్చిన బృంద సభ్యులను అభినందించారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.