తమిళ అగ్ర హీరో అజిత్ ఇంటి ముందు ఓ మహిళా అభిమాని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఫర్జానా అనే మహిళ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. గతేడాది అజిత్, తన భార్య షాలినితో కలిసి ఆ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న ఫర్జానా, అజిత్‌తో ఫోటోలు దిగి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె చర్యపై సీరియస్ అయిన ఆస్పత్రి యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. అజిత్ ఒక్కసారి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే తనకు మళ్లీ ఉద్యోగం వస్తుందని, ఫర్జానా చాలాసార్లు అతడిని కలిసే ప్రయత్నం చేసింది. అయితే అజిత్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో ఆమె అజిత్ ఇంటి ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆమెను కాపాడి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
A lady named #Farzana who lost job in hospital tried to set her ablaze in front of #Thala #AjithKumar's house.
She has been stopped & detained by the police. pic.twitter.com/RoeJlTA1E7
— Manobala Vijayabalan (@ManobalaV) October 4, 2021