లీకైన అఘోర ఫోటోలు..ఆందోళనలో బాలయ్య ఫాన్స్

  0
  755

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి అయినట్టు డైరెక్టర్ బోయపాటి శీను ప్రకటించేశారు.. గర్జనకు సింహం సిద్ధంగా ఉందంటూ కాప్షన్ పెట్టి మరీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాజాగా అఖండ మూవీ టీం మొత్తం కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. డైరెక్టర్ బోయపాటితో పాటూ.. హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఈ పార్టీకి వచ్చారు.

  అయితే ఇప్పుడు తాజాగా మూవీ యూనిట్ ను ఓ కలవరపరచే విషయం ఒకటి వెలుగు చూసింది. నందమూరి బాలయ్య అఖండ మూవీలో అఘోరాగా కనిపించబోతున్నాడు

  ఈ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చేసింది. ఆ ఫోటో ను వెంటనే డిలీట్ చేయాలని బాలయ్య అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో ఓ సమాచారం సర్క్యులేట్ అవుతోంది.

  ఆ ఫొటోలో బాలకృష్ణ సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ కూడా కనిపిస్తున్నారు. అయితే ఆ ఫొటోలో అసలు వారిద్దరూ ఎందుకు ఉన్నారు..? మోక్షజ్ఞ ఏమైనా ఈ మూవీలో నటిస్తున్నాడా..? లేక బాలకృష్ణ లుక్ బయటకు వెళ్లకుండా, అభిమానులను ఒకేసారి సర్ ప్రైజ్ చేద్దామని ఆ ఫోటో బయటకు వెళ్లకుండా చూస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.