సారీ మేడం ..శారీ కట్టుకుంటే మా హాటల్లో నో ఎంట్రీ..

    0
    1221

    భార‌త‌దేశం అంటే సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు పుట్టినిల్లు. ఏ దేశ‌మైనా భార‌తదేశాన్ని గౌర‌వంగా చూస్తోందంటే… అందుకు కార‌ణం, మ‌న‌ సంప్ర‌దాయ‌లు, సంస్కృతి అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఇక చీర క‌ట్టు అనేది మ‌న భార‌తీయ సంప్ర‌దాయాల్లో గొప్ప‌ది. చీర‌క‌ట్టులో మ‌హిళ‌ల అందం మ‌రింత ఉట్టిప‌డుతుంటుంది. అంత‌టి విశిష్ట‌త క‌లిసిన చీర క‌ట్టుని ఇత‌ర దేశాల మ‌హిళ‌లు క‌ట్టుకుని సింగారించుకున్న సంద‌ర్భాలు అనేకం చూశాం. కానీ భార‌తీయ సంప్ర‌దాయాన్ని అవ‌మానించేలా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌, అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

    ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్ లోకి ఓ మ‌హిళ చీర‌క‌ట్టుతో వెళ్ళింది. అయితే అక్క‌డి సిబ్బంది ఆమెను అడ్డుకుంది. అయితే ఆ మ‌హిళ‌, త‌న‌ను అడ్డుకోవ‌డానికి గ‌ల కార‌ణం చెప్ప‌మ‌ని అడిగింది. అందుకు ఆ సిబ్బంది… ఈ హోట‌ల్ స్మార్ట్ క్యాజువ‌ల్స్ కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తుంద‌ని చెప్పంది. స్మార్ట్ క్యాజువ‌ల్స్ అంటే ఏంటి అని ఆ మ‌హిళ తిరిగి ప్ర‌శ్నించ‌గా… జీన్స్ టీష‌ర్ట్, స్క‌ర్ట్స్, మిడ్డీస్ వంటి లిస్టు చెప్పుకొచ్చింది. చీర స్మార్ట్ క్యాజువల్ గా లెక్కలోకి రాదంటూ ఆ మ‌హిళ‌ల‌ను హొట‌ల్ సిబ్బంది లోప‌లికి అనుమతించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. హోట‌ల్ తీరును తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌డుతూ ఆ మ‌హిళ త‌న ఆవేద‌న‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. దీంతో నెటిజ‌న్లు ఆ రెస్టారెంట్ నిర్వాకంపై మండిప‌డుతున్నారు. భార‌తీయ సంప్ర‌దాయాన్ని అగౌర‌వ ప‌రుస్తున్నారంటూ విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.