నేటి రోజుల్లో చాలా మందికి రాత్రి వేళల్లో సరిగ్గా నిద్ర పట్టదు.. రోజంతా చికాకు.. సమస్యలతో సతమతమవుతున్న కుర్రకారు సంగతైతే అసలే చెప్పాల్సిన అవసరం లేదు.. అర్ధరాత్రి రెండవుతున్నా నిద్రపట్టని వారు మనలో చాలా మందే ఉంటారు. నిద్రమాత్రలు వేసుకోనిదే నిద్ర పట్టని వారు కూడా చాలామందే ఉంటారు. ఇలా నిద్ర పట్టకపోవడం వలన చాలా సమస్యలు వస్తుంటాయి. ముందురోజు సరిగ్గా నిద్ర పోకపోతే తర్వాత రోజంతా నీరసంగా ఉండటం.. బద్దకంగా ఫీలవడం.. కూడా మనం చూస్తూనే ఉంటాం.. అయితే నిద్రలేమికి చక్కని పరిష్కారం మాత్రం బనానా టీ.. పడుకొనే ముందు ఒక్క కప్పు బనానా టీ తాగితే చాలు.. ఎంతో చక్కగా నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
అరటిపండులో ఉండే అమినో యాసిడ్.. ట్రిప్టోపన్ అనే రసాయనాలు మెదడులోని సెరోటమిని ఉత్పత్తి చేస్తాయి. దీనివలన నిద్ర బాగా పడుతుంది. అందుకే మన పూర్వీకులు కూడా అరటిపండుని పడుకునే ముందు తినమని చెప్పేవారు.. ఇక దాల్చిన చెక్క అరుగుదలకు, రక్తప్రసరణను బాగా పనిచేస్తుంది. విదేశాల్లోని ఆరోగ్య శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నారు. అందుకే ఇకపై ఎప్పుడైనా సరిగ్గా నిద్రపట్టకపోతే “బనానా టీ” ని త్రాగడం అలవాటుగా చేసుకోండి.. చక్కగా నిద్రపోండి.. ఆరోగ్యంగా జీవించండి..