బంగినపల్లి, రసాలు, నూజివీడు మామిడి.. ఇలా చాలా రకాలున్నాయి. ప్రస్తుతం న దగ్గర కేజీ 30రూపాయలనుంచి అందుబాటులో ఉన్నాయి. మహా అయితే ఈ సీజన్లో అత్యథికంగా కేజీ 100రూపయాకు అమ్ముడు పోతుందేమో. అయితే ఒక్కో మామిడిపండు వెయ్యి రూపాయలు అమ్మడం మీరెక్కడైనా విన్నారా? అవును ఒక్కో మామిడికాయ అక్షరాలా వెయ్యి రూపాయలు. దానిపేరే నూర్జహాన్ మామిడి.
మధ్యప్రదేశ్ స్పెషల్..
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో మాత్రమే పండే నూర్జహాన్ మామిడి పండు ధర ఎప్పుడూ చుక్కల్లోనే ఉంటుంది. ఈ మామిడి ఒక్కోటి దాదాపు 1000 రూపాయలు పలుకుంతుంది. వినడానికి ఇది ఆశ్చర్యంగానే ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఈ పండ్లకు ఇప్పటికే బుకింగ్ కూడా జరిగిపోయింది. మధ్యప్రదేశ్‌తో పాటు పొరుగున ఉండే గుజరాత్‌కు చెందిన ఈ పండ్లను ఇష్టపడే వారు ముందుగా వీటిని బుక్ చేసుకున్నారు. ఈ సారి ఒక్కో నూర్జహాన్ మామిడి పండు బరువు 2 నుంచి మూడున్నర కిలోల దాకా ఉంది. గత ఏడాది వాతావరణం సరిగా లేకపోవడంతో నూర్జహాన్ చెట్లు సరిగా పూత పూయలేదు. జనవరి నెలలో పూతకు వచ్చే ఈ రకం పండ్లు జూన్ నెలలో మాత్రమే లభిస్తాయి.
ఆఫ్ఘాన్ బ్రీడ్..
ఈ ఏడాది దిగుబడి బాగా ఉండడంతో పాటుగా పండు సైజు కూడా పెద్దదిగా ఉండడంతో ఒక్కో పండు ఖరీదు వెయ్యి రూపాయలు పలుకుతోందని చెబుతున్నారు స్థానికులు. ఆఫ్ఘానిస్థాన్ ప్రాంతానికి చెందిన ఈ నూర్జహాన్ మామిడిని గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అలీరాజ్‌పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తారు. 2019లో ఒక్కో పండు 2.75 కేజీల బరువుతో పండిందని, అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికిందని చెబుతున్నాడు అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్.