లేట్ అయినా, ఆ కోరిక తీర్చుకుంటా: నివేదా

  0
  450

  అందంతో పాటు అభిన‌యంలోనూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ‌ల్లో నివేదా థామ‌స్ పేరు కూడా క‌నిపిస్తుంది. నాని ‘జెంటిల్ మేన్’ సినిమా ద్వారా పరిచయమైన నివేదా… త‌క్కువ టైంలోనే వాటెంట్ హీరోయిన్ల లిస్టులోకి వెళ్ళిపోయింది. అలాంటి ఈ కేర‌ళ కుట్టికి ఓ కోరిక ఉంద‌ట‌. అయితే ఆ కోరిక ఇప్ప‌ట్లో తీరేది కాద‌ట‌. కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ట. ఇంత‌కీ ఆ కోరిక ఏమిటంటే… మెగాఫోన్ ప‌ట్టుకోవ‌డం.
  మొదటి నుంచి కూడా తనకి డైరెక్షన్ అంటే ఇష్టమనీ, అందువలన డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ ను కూడా పూర్తిచేశానని చెబుతోంది నివేదా. హీరోయిన్ గ్రాఫ్ నెమ్మ‌దించిన త‌ర్వాత‌ మెగా ఫోన్ పడతానని చెబుతోంది. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాననీ, ఆ తరువాతనే సినిమా వైపు వస్తానని క్లారిటీ ఇస్తోంది. మొత్తానికి పెద్ద ప్లాన్ తోనే ఉంద‌ని అర్ధ‌మ‌వుతోంది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..