ప్రయివేట్ విమానాల్లో – కామాంధుల కౌగిళ్ళలో .

  0
  3765

  ప్రైవేట్ విమానాల్లో రాస‌లీల‌లు… ఆకాశంలో శృంగార కేళీ విన్యాసాలు… ఇవేవో సినిమా పేర్లు కావు. కోటీశ్వ‌రులు, రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, అర‌బ్ దేశాల్లో రాజులు, రాకుమారులు, ర‌ష్యాలో సంప‌న్నులు, జ‌ర్మ‌నీలో కుబేరులు… ఇలా అన్ని ప్రైవేట్ జెట్ విమానాల్లో ఎయిర్ హోస్టెస్ గా ప‌ని చేసిన శ‌స్కియా స్వాన్ త‌న అనుభ‌వాల‌తో రాసిన పుస్త‌కాల‌తో సంచ‌ల‌న విష‌యాల‌ను బైట పెట్టింది. ప్రైవేట్ జెట్ విమానాల్లో చాలావ‌ర‌కు ఒక్క‌మాట‌లో చెప్పాలంటే త‌న వ‌ర‌కు ఒక సెక్స్ బొమ్మ‌గానే ఉప‌యోగించుకునే వార‌ని, త‌న‌ను ట్రాలీ డాలీగా పిలుచుకుంది.

  ప్రైవేట్ జెట్ విమానాల్లో చాలావ‌ర‌కు కోటీశ్వ‌రులు త‌మ ప్రియురాళ్ళ‌ను తీసుకొచ్చుకుని గంట‌ల త‌ర‌బ‌డి, విమానాలు దిగేవ‌ర‌కు రాస‌లీల‌లు సాగించేవార‌ని చెప్పింది. ప్రైవేట్ జెట్ ల‌లో రాస‌లీల‌ల‌పై ఆమె రాసిన పుస్త‌కం ఇప్పుడు ఓ సంచ‌ల‌నం. నికోల‌స్ స్టో అనే మ‌రో ఎయిర్ హోస్టెస్ తో క‌లిసి త‌మ అనుభ‌వాల‌ను ఈ పుస్త‌కంలో రాశారు. ప్రైవేట్ జెట్ ల‌లో ప్రియురాళ్ళు లేని స‌మ‌యంలో త‌మ‌ను ఎలా సెక్స్ కోసం వినియోగించుకుంటారో కూడా విశ‌దంగా వివ‌రించింది. జెట్ విమానాల కంపెనీ య‌జ‌మానులు కూడా ప్రైవేట్ జెట్ ల‌లో ప‌ని చేయాలంటే ప‌డ‌క సుఖానికి కూడా ఒప్పుకోవాల్సిందేన‌ని, ప‌రోక్షంగా చెప్పే ఉద్యోగం ఇస్తార‌ని చెప్పింది. జీతం డ‌బ్బుల కోసం ప్రైవేట్ జెట్ ల‌లో ఆకాశంలో కోటీశ్వ‌రుల కోరిక‌ల‌కు న‌లిగిపోక త‌ప్ప‌ద‌ని వాపోయింది. విమానాలు ఉన్న వారంద‌రూ కోటీశ్వ‌రులే కానీ త‌మ‌లాంటి వారిని విమానాల్లోనే తార్చి బ్రోక‌ర్లుగా కూడా మార్చేస్తార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.ప్రైవేట్ జెట్ విమానం దిగిన త‌ర్వాత కూడా మ‌ళ్ళీ వారు తిరిగి వ‌చ్చే దాకా, హోట‌ల్ గ‌దుల్లో వారి కామానికి బ‌లి కావాల్సిందేన‌ని చెప్పారు. ఇంతా చేస్తే సంవ‌త్స‌రానికి 40 ల‌క్ష‌ల రూపాయ‌లు జీతంగా ఇస్తార‌ని, ఆ గ్లామ‌ర్ ప్ర‌పంచం ఆకాశం నుంచి త‌మ‌ను కింద‌కు దిగ‌నీయకుండా చేస్తుంద‌న్నారు.

  ఫైవ్ స్టార్ హోట‌ల్ గ‌దులు, డిజైన‌ర్ డ్రెస్సులు, జీతం కాక రోజుకి 8వేల రూపాయ‌ల అల‌వెన్స్… ఇలాంటివ‌న్నీ త‌మ‌ను ఆ బందీఖానా నుంచి బ‌య‌ట‌ప‌డ‌కుండా చేస్తామ‌నే నిజాన్ని కూడా చెప్పుకొచ్చింది. 35-40 ఏళ్ళ త‌ర్వాత త‌మ అందం చెదిరిపోయే ద‌శ‌లో నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలో నుంచి తీసివేస్తార‌ని చెప్పింది. సాధార‌ణంగా ప్రైవేట్ జెట్ విమానాల్లో కుటుంబ‌స‌భ్యులు వెళ్ళే స‌మ‌యాల్లో త‌ప్ప 80 శాతం మంది ముఖ్యంగా ర‌ష్యా, జ‌ర్మ‌నీ, గ‌ల్ఫ్ దేశాల సంపన్నులు ప్రియురాళ్ళ‌తోనో, ఉంపుడుగ‌త్తెల‌తోనో.. వారేవ‌రూ లేక‌పోతే, త‌మ‌లాంటి ఎయిర్ హోస్టెస్ ల‌తోనో ఆకాశంలో శృంగారం చేస్తార‌ని తెలిపింది. ఒక్కోద‌ఫా విమానంలోకి వారు ప్ర‌వేశించ‌క‌ముందే ఆహార మెనూతో పాటు వ‌యాగ్రా ట్యాబ్లెట్లు కూడా తామే తెచ్చిపెట్టాల్సి వుంటుంద‌ని తెలిపారు. ప్రియురాళ్ళ‌తో శృంగారం కోసం ప్రైవేట్ జెట్ల‌ను బుక్ చేసుకున్న వాళ్ళ‌కు లేదా… కొత్త‌గా పెళ్ళ‌యిన దంప‌తుల‌కు శోభ‌నం ఏర్పాటు చేసే విష‌యంలో కూడా తామే బెడ్ రూమ్ అలంక‌రించాల్సి వుంటుంద‌ని, ఇందుకోసం బ‌స్తాల కొద్దీ రోజా పూల రెక్క‌లు తెప్పిస్తార‌ని చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి ప‌నులు గ‌ల్ఫ్ దేశాల సంప‌న్నులు చేస్తార‌ని తెలిపారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..