కబాబ్ కోసం 2 కోట్ల 30 లక్షల కారు దగ్ధం..

  0
  413

  డ‌బ్బులున్నోడు త‌ల తిక్క ప‌నికి ఖ‌రీదైన కారు కాలి బూడిదైంది. ఓ తిక్క‌లోడు త‌న లాంబొర్గిని కారుతో ఎగ్జాస్ట‌ర్ పైపు వ‌ద్ద చికిన్ క‌బాబ్ లు పెట్టి వేడి చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఆ ప్ర‌య‌త్నం విక‌టించి కారు కాలిపోయింది. ఓ రోడ్ సైడ్ బార్బిక్యూ రెస్టారెంట్ లో ఇత‌డు క‌బాబ్ లు కొన్నాడు. ఫోన్ మాట్లాడుతుండ‌గా అది చ‌ల్లారిపోయింది. దీంతో అతి తెలివి ప్ర‌ద‌ర్శించారు. ఇంజిన్ హైరేంజ్‌లో పెట్టి క‌బాబ్ ల‌ను ఎగ్జాస్ట‌ర్ పైపు వ‌ద్ద పెట్టాడు. మ‌ళ్ళీ దీన్ని గ్యాస్ స్ట‌వ్ ల మీద పెట్టి వేడి చేసే కంటే ఖ‌రీదైన లాంబోర్గిని స్పోర్ట్స్ కారులో ఎగ్జాస్ట‌ర్ వేడితో తినాల‌ని భావించాడు.

  స్పోర్ట్స్ కారు కాబ‌ట్టి ఇంజ‌న్ హైరేంజ్ లో పెట్ట‌డంతో మంట‌లు వ్యాపించాయి. ఆ మంట‌ల్లో క‌బాబ్ లు వేడి చేశాడు. అయితే ఉన్న‌ప‌ళంగా కారు ఇంజ‌న్ నుంచి కూలెంట్ ఆయిల్ కాలిపోయింది. ఆ త‌ర్వాత వెంట‌నే కారు మండిపోయింది. ఇక చేసేదేమీ లేక నెత్తినోరూ బాదుకున్నాడు. లాంబొర్గిని, అవెంటడార్ కారులో కూలెంట్ ఆయిల్ అప్పుడ‌ప్పుడు ఎగ్జాస్ట‌ర్ గుండా వెన‌క నుంచి మంట‌లు వ‌స్తుంటాయి. ఈ స్పోర్ట్స్ కారుకి అదే స్పెషాలిటీ. స్టంట్స్ చేసే వారు అలా వాడుతుంటారు. ఈ వ్య‌క్తి కూడా అలా ట్రై చేసి కారును పోగొట్టుకున్నాడు. ఇంత‌కీ ఈ కారు విలువ ఎంతో తెలుసా ? 2 కోట్ 30 ల‌క్ష‌ల రూపాయ‌లు. చైనాలోని యువాన్ ప్రాంతంలో జరిగిందీ ఘ‌ట‌న‌.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..