భర్తను కిడ్నాప్ చేసి విడాకులు రాయించుకుంది..

    0
    210

    కాలం మారిపోయింది.. అమ్మాయిలు రివర్స్ అవుతున్నారు. ఓ వివాహిత ప్రియుడితో కలిసి ఉండేందుకు , భర్తను కిడ్నాప్ చేయించింది. హైదరాబాద్ ఆర్టీసి కాలనీకి చెందిన ఆసియా బేగం కు తొమ్మిదేళ్లక్రితం వాజిద్ అనే యువకుడితో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు , భర్త సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. ఆసియా బేగం కు , సోషల్ మీడియాలో ఆసిఫ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. చిన్నగా , చాటింగ్ తో మొదలైన సంబంధం , అక్రమ సంబంధం వరకు దారితీసింది.

    భర్త ఇంట్లోలేనప్పుడు , ఇద్దరూ కలుసుకునేవారు. ఆసియా బేగం ప్రియుడి మోజులో పడి భర్తకు విడాకులు ఇవ్వాలని భావించింది. అయితే నాలుగు నెలలక్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రియుడితో ఉండింది. భర్త ఫిర్యాదుతో మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని భర్తకు అప్పగించారు. బిడ్డలకోసం వాజిద్ , ఆమెను క్షమించి బుద్దిగా ఉండమని కోరాడు. అయితే చెడు తిరుగుళ్లకు అలవాటుపడ్డ ఆసియాబేగం

    ప్రియుడితోనే ఉండేందుకు భర్తను కిడ్నాప్‌ చేయించింది. ముషీరాబాద్‌లో ఖాజీ ఎదుట విడాకుల కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా షేక్‌ వాజీద్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ముషీరాబాద్‌కు చెందిన ఇమ్రాన్‌ అహ్మద్‌(31), పార్శీగుట్టకు చెందిన జాఫర్‌(33), ఇర్ఫాన్‌ అహ్మద్, మహమూద్‌లను ఆసిఫ్‌ సిద్ధం చేశాడు. సోమవారం సాయంత్రం ప్రియుడు ఆసిఫ్ , తన ముగ్గురు స్నేహితులతో కలిసి , వాజిద్ ను కిడ్నాప్ చేసి , తీవ్రంగా కొట్టి , విడాకుల పత్రాలపై సంతకం చేయించాడు. షాపు ముందే కిడ్నాప్ అయిన వాజిద్ గురించి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మూడు గంటల్లో కేసుని ఛేదించారు. ఆసియా బేగం ని అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.