కొన్ని సార్లు కొన్ని ఆటోలు తోసినా పోవు.. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాకుండా మొరాయిస్తాయి. అయితే ఈ ఆటో చూడండి.. నడిరోడ్లో స్టార్ట్ చేయకుండానే రయ్.. అంటూ రోడ్డంతా గిరికీలు కొట్టేసింది. ఆటో డ్రైవర్ దాన్ని పక్కన ఆపి మందుకొట్టి వచ్చాడు. ఆటో తీయబోతుంటే మనోడు తూలాడో , అది వాలిందో గానీ , ఆటోమాటిక్ గా స్టార్ట్ అయింది.. కిందకు వాలిపోతుంటే పక్కనవాళ్లు పట్టుకున్నా ఆగకుండా రద్దీగా ఉండే రోడ్డులో స్పీడ్ గ వెళ్ళిపోయింది.. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు.. శివపురిలో జరిగిందీ ఘటన..