ట్యాబ్లెట్లు మార్చి ,భర్తను చంపింది..

  0
  2850

  అక్రమ సంబంధాల మోజులో, భర్తల్ని హత్య చేస్తున్న భార్యల ప్లాన్లు చూస్తుంటే పేరుమోసిన క్రిమినల్స్ కూడా ఇలాంటి ఆలోచనలు చేయరేమో అనిపిస్తుంది. దేశంలో ఇటీవల కాలంలో భర్తల్ని చంపే భార్యల నేరాలు ఎక్కువవుతున్నాయి. అలాంటిదే ఇది. హమీద్ అనే ఓ వ్యక్తి, మహారాష్ట్రలోని కేడీపూర్ కి చెందినవాడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

  భర్త దూరంగా ఉండటంతో భార్య తబస్సుమ్, అదే ప్రాంతంలో ఉన్న మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో హమీద్ ఇంటికొచ్చేశాడు. దీంతో ప్రియుడిని కలిసేందుకు వీలు కాలేదు. భర్తను చంపేసి ప్రియుడితో ఉండాలన్న నిర్ణయానికొచ్చింది. ఈ విషయం ప్రియుడితో చెప్పింది. భర్తను ఎలా చంపాలన్న విషయమై గూగుల్ లో సెర్చ్ ప్రారంభించింది. ఇటీవల ఓ రోజు రాత్రి పదిన్నరనుంచి ఏకధాటిగా వేకువఝామున 5 గంటల వరకు భర్తను ఎలా చంపాలి, ఆధారాలు లేకుండా ఎలా తప్పించుకోవాలి, ఏ మందులు ఇస్తే ఎలా చనిపోతారు అనే విషయాలపై సెర్చ్ చేసింది.

  హమీద్ కు ఉబ్బసం వ్యాధి ఉంది. దీనికి రోజూ మందులు వాడతాడు. భార్త తబుస్సుమ్ ఆ మందుల్ని మార్చేసి విష ప్రభావం ఉన్న మందుల్ని తెప్పించింది. ఉబ్బసం మందుల స్థానంలో ఆ మందులు పెట్టింది. భర్తకు అది ఇచ్చింది. ఆ మాత్రలు వేసుకోవడంతోనే అతడు స్పృహ తప్పి పడిపోయాడు. ప్రియుడు ఇర్ఫాన్ ను పిలిపించి స్కార్ఫ్ తో హమీద్ చేతులు, కాళ్లు కట్టేసి, సుత్తితో తలమీద కొట్టి చంపేసింది. తెల్లవారిన తర్వాత ఏడుస్తూ ఇంటిబయటకు పరిగెత్తింది.

  తన భర్తను ఎవరో చంపేశారంటూ కేకలు పెట్టి ఏడుపు మళ్లుకుంది. దీంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు కూడా ఆమెను ఏం ప్రశ్నించకుండా రహస్యంగా ఆమె నెంబర్ నుంచి పోయిన కాల్ వివరాలను తెప్పించుకున్నారు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని గూగుల్ హిస్టరీ పరిశీలించారు. దాంతో పోలీసులకు మతిపోయింది. రాత్రంతా భర్తను చంపే విధానంపై ఆమె గూగుల్ లో సెర్చ్ చేసి ఒక వ్యూహం ప్రకారం భర్తను చంపినట్టు నిర్థారణకు వచ్చారు. దీంతో ఆమె ముందు ఈ వివరాలన్నీ చూపెట్టడంతో నేరం ఒప్పుకుంది. తబస్సుమ్ ని, ప్రియుడు ఇర్ఫాన్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..