పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కి కవల పిల్లలు..

  0
  653

  పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్, అతని భార్య కాసి బెన్నెట్ జంటకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. సోషల్ మీడియాలో వారు ఫొటోలు షేర్ చేశారు. వీరికి థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టినట్లు ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను బోల్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కవలలు ఎప్పుడు జన్మించారో మాత్రం వెల్లడించలేదు. క్యాప్షన్‌లో తన పిల్లల పేర్ల పక్కన మూడు మెరుపు బోల్ట్ ఎమోజీలను ఉంచాడు. ఉసేన్ బోల్డ్ దంపతులు, కవలలతో పాటు కుమార్తె కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోను ఉసేన్ బోల్డ్ భార్య కాసి బెన్నెట్ షేర్ చేశారు. ఇందులో ” హ్యాపీ ఫాదర్స్ డే టూ మై లవ్! ఉసేన్ బోల్డ్.. ఈ కుంటుబానికి నువ్వో రాక్‌ లాంటోడివి. మన పిల్లలకు నువ్వో గొప్ప తండ్రివి. నీపై అంతులేని ప్రేమను కలిగి ఉన్నామని” భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. ఉసేన్ బోల్ట్ కుమార్తె ‘ఒలింపియా బోల్ట్’ 2020 మేలో జన్మించింది. రెండు నెలల తరువాత ఆమె పేరును ప్రకటించాడు ఈ పరుగుల వీరుడు. ఇక ఈ ఫొటోను చూసిన నెటిజన్లు.. కామెంట్లతో పరుగులు పెట్టించారు. 2008, 2012 , 2016 క్రీడలలో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన 34 ఏళ్ల బోల్ట్.. 2017 లో రిటైర్మెంట్ ప్రకటించడంతో.. వచ్చే నెలలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో పోటీ చేయడం లేదు.

   

  View this post on Instagram

   

  A post shared by Kasi J. Bennett (@kasi.b)

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..