భర్తను చంపే భార్య కరోనా టెక్నిక్ ..

  0
  333

  భ‌ర్త‌ల‌ను చంపే భార్య‌ల్లో ఈ భార్య కొత్త టెక్నిక్ నేర్చుకుంది. ఆమెకు ఇద్ద‌రు ప్రియుళ్ళు. ఒక భ‌ర్త ఇద్ద‌రు ప్రియుళ్ళ‌తో నాట‌కం ఆడి చివ‌ర‌కు భ‌ర్తను చంపేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఇద్ద‌రు ప్రియుల‌ను ఆమె ఉసిగొల్పింది. త‌మిళ‌నాడులోని ఈరోడ్ జిల్లా కుమార్ పాళ్యంకు చెందిన ప్ర‌భావ‌తికి 12 ఏళ్ళ క్రితం పెళ్ళ‌యింది. ప‌దేళ్ళ కూతురు ఉంది. భ‌ర్త శ్రీనివాస‌న్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో శ‌ర‌వ‌ణ్ కుమార్, పొరొటా వెల్లంగి అనే వ్య‌క్తుల‌తో ప్ర‌భ వివాహేత సంబంధం పెట్టుకుంది. క‌రోనా టైంలో చంపేసి త‌న భ‌ర్త క‌రోనాతో ఊపిరి ఆడ‌కుండా చ‌నిపోయాడ‌ని నాట‌కం ఆడింది.

  ఇద్ద‌రు ప్రియుళ్ళ సాయంతోనే భ‌ర్త‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్ళింది. డాక్ట‌ర్లు ప‌రీక్షిస్తే అప్ప‌టికే అత‌ను చ‌నిపోయి ఉన్నాడు. కొద్దిరోజులుగా క‌రోనాతో బాధ ప‌డుతున్నాడ‌ని, ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటే ఆస్ప‌త్రికి తీసుకొచ్చిన‌ట్లు చెప్పింది. డాక్ట‌ర్లు ప‌రీక్షించి అత‌ను చ‌నిపోయాడ‌ని చెప్పారు. ఆస్ప‌త్రి వ‌ద్ద మృతుడు శ్రీనివాస‌న్ క‌నిపించ‌డంతో ఆమెలో ఆందోళ‌న మొద‌లైంది.

  శ్రీనివాస‌న్ మృత‌దేహాన్ని చూసిన బంధువుకు మెడ‌పై గాయం ఉండ‌డం క‌నిపించింది. దీంతో అత‌ను వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. పోలీసులను చూసిన ఇద్ద‌రు ప్రియుళ్ళు త‌ప్పించుకున్నారు. డాక్ట‌ర్లు ప‌రీక్షించి అత‌నికి క‌రోనా లేద‌ని నిర్ధారించారు. ఎవ‌రో శ్రీనివాస‌న్ మెడ‌ను బ‌లంగా ఒత్తి చంపార‌ని అన్నారు. దీంతో పోలీసులు గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో, త‌న ఇద్ద‌రు ప్రియుళ్ళ‌తో క‌లిసి చంపేశాన‌ని అంగీక‌రించింది. క‌రోనాతో చ‌నిపోయాడ‌ని చెప్తే ప్ర‌భుత్వ‌మే తీసుకెళ్ళి పూడ్చేస్తుంద‌ని, ఇంత‌టి ఘోరానికి ఒడి గ‌ట్టింది. అక్ర‌మ సంబంధం గురించి ప్ర‌శ్నించ‌డంతో, భ‌ర్త‌ను చంపేశాన‌ని విచార‌ణ‌లో వెల్ల‌డించింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..