ఒకే ఒక్క‌డు … దుబాయ్ విమానంలో ..

  0
  68

  ఒకే ఒక్క‌డు … దుబాయ్ విమానంలో ఒకే ఒక్క ప్యాసింజ‌ర్. అతని ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించండి. అత‌నొక్క‌డే ముంబాయ్ నుంచి దుబాయ్ కి వెళుతున్న ఫీలింగ్ తో వెళ్ళాడు. దుబాయ్ లో స్థిర‌ప‌డ్డ భార‌తీయుడు భ‌వేష్ జ‌వేరి ముంబై నుంచి దుబాయ్ కి టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. బోయింగ్ 777-300 విమానంలో 360 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఈ విమానంలో ఇంత‌కుముందు టిక్కెట్లు బుక్ చేసుకున్న చాలామంది కోవిడ్ కార‌ణంగా ర‌ద్దు చేసుకోవ‌డ‌మో, ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవ‌డ‌మో జ‌రిగింది. భ‌వేష్ జ‌వేరి ఒక్క‌డే ఈ విమానం ఎక్కాడు. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఈ విమానంలో ఒక్క ప్ర‌యాణీకుడుతోనే విమానం టేకాఫ్ అయింది. త‌మ విమానంలోకి భ‌వేష్ జ‌వేరిని చ‌ప్ప‌ట్ల‌తో ఆహ్వానించారు. ఇది త‌న జీవితంలో మ‌ర‌పురాని అనుభ‌వం అని భ‌వేజ్ ఆనందం వ్య‌క్తం చేశాడు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..