వీధుల్లో ఉతికి ,ఆరేసి , చొక్కాపట్టుకొని…

    0
    5469

    అమ్మాయి బుట్టలో పడిందికదా అని వాడుకొని వదిలేసే కాలం కాదుఇది.. ఇంటిముందు ధర్నాకో , పోలీస్ స్టేషన్ కో , కాదంటే అబ్బాయిలపై యాసిడ్ పోసేదానికో దైర్యం ఉన్న అమ్మాయిల కధలు ఎన్నో.. ? అయితే ఇదిగో ఈ అమ్మాయి అలాంటిదికాదు.. ప్రేమించి పెళ్ళాడి , కొన్నాళ్ళు కాపురంచేసి , చెప్పకుండా చెక్కేసిన వాడిని వెదికి పట్టుకొని , వీధుల్లో ఉతికి ,ఆరేసి , చొక్కాపట్టుకొని పోలీస్ స్టేషన్ కి లాక్కుపోయింది. ఒరిస్సాలోని కుంకుబడి గ్రామానికి చెందిన యువకుడు సుమన్‌ కుసులియా 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రొయ్యిల పరిశ్రమలో పనికి చేరాడు.

    అదే పరిశ్రమలో పనిచేస్తున్న విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన యువతి బెలసుర కుమారితో స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 3నెలల క్రితం అక్కడికి సమీపంలోని ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 6 నెలలు కాపురం చేసి చెప్పకుండా పారిపోయాడు. దీంతో కుమారి వాడికోసం గాలించింది. బిసంకట లో ఉన్నాడని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి , నాలుగురోజులు వెదికి , ఒక ఆటో స్టాండ్ లో పట్టేసింది. వీడు ఆటో వేస్తున్నాడు. ఆటో స్టాండ్ లోనే కొట్టి , చొక్కాపట్టుకొని స్టేషన్ కి ఈడ్చుకుపోయింది. కుమారిని వదిలి వచ్చేసిన తరువాత , వీడు మరో పెళ్లిచేసున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.