మరో 12 గంటల్లో ఉత్తర కోస్తాకు పెనుముప్పు..

  0
  1169

  మరో 12 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు తుఫాను పెనుముప్పు ముంచుకు రానుంది. ప్రస్తుతానికి బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కళింగపట్నానికి 660 కీలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిఉంది. ఇప్పుడు ఇది తీరం వైపు మెల్లగా కదులుతుంది . ఆదివారం సాయంత్రానికి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

  వచ్చే 12 గంటల్లో వాయుగుండం బలపడి తుఫానుగా మారనుందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు అన్నారు.ఇది రేపు సాయంత్రానికి విశాఖ, ఒరిస్సాలోని గోపాల్ పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల మన రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షం కురిసే సూచనలున్నాయి. కోస్తాఆంధ్రలో కూడా ఒక మోస్తరు నుంచి , భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.