గాల్లోకి గ‌న్ లో ఎక్కుపెట్టిన భ‌ద్ర‌తాసిబ్బంది…

  0
  125

  గాల్లోకి గ‌న్ లో ఎక్కుపెట్టిన భ‌ద్ర‌తాసిబ్బంది…
  =================
  పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపూర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ఆమె, బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో స్వ‌ల్ప‌తేడాతో ఓటమి పాలైంది. దీంతో భవానీపూర్ ఉపఎన్నికలో దీదీ తప్పకుండా నెగ్గాల్సిన పరిస్థితి ఉంది. మమతకు పోటీగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను బీజేపీ బరిలోకి దించింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. దీంతో ఇరు పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ఈ నేప‌ధ్యంలో భవానీపూర్ నియోజకవర్గంలో ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు బీజేపీ తరఫున దిలీప్‌ ఘోష్ అక్కడకు వెళ్లారు. ప్రచార సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఆయ‌న‌ను అడ్డుకున్నారు. దీంతో ఆయ‌నకు భ‌ద్ర‌తాసిబ్బంది ర‌క్ష‌ణ‌వ‌ల‌యంగా ఏర్పడ్డార‌.అయిన‌ప్ప‌టికీ కార్య‌క‌ర్త‌లు వారిని తోసుకుంటూ ముందుకు సాగ‌డంతో.. ఇద్దరు భ‌ద్ర‌తా సిబ్బంది తుపాకులు బయటకు తీసి, గాల్లోకి ఎక్కి పెట్టారు. ఈ ఘ‌ట‌న నెట్టింట్లో వైర‌ల్ అయింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.