పులిబారినుంచి తప్పించుకున్నా ప్రాణాలతో బతికి బయటపడటం అరుదైన సంఘటనే. అలాంటిది చిరుత పులినుంచి తప్పించుకున్న ఓ నాలుగేళ్ల పిల్లాడు బతికి బయటపడ్డాడు. అతని మేనమామ చేసిన సాహసం అలాంటిది. మేనల్లుడికోసం ప్రాణాలు పణంగా పెట్టి పిల్లాడిని కాపాడాడు. ఈ ఘటన.. ముంబైలోని ఆరే కాలనీలో జరిగిది. దగ్గరలోని అడవినుంచి జనావాసాల్లోకి వచ్చిన చిరుత నాలుగేళ్ల పిల్లాడిని నోటకరుచుకుంది. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆడుకుంటున్న పిల్లవాడిని తీసుకెళ్తున్న పులిని ఆ పిల్లవాడి మేనమామ అడ్డుకున్నాడు. దగ్గర్లోని పొదల్లోకి దూరగా మిగతా వారిని వెంటబెట్టుకుని అక్కడికి పోయాడు. దాన్ని తరిమేశాడు. పిల్లవాడిని వదిలేసి చిరుత పారిపోయింది. మెడ, తలపై గాయాలు కాదా.. ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.
ఇవీ చదవండి..