పోలీసులు చుట్టుముట్టి గొడ్డుని బాదినట్టు ..

  0
  290

  ఒకరుకాదు , ఇద్దరు కాదు , ముగ్గురుకాదు.. ఆరుగురు పోలీసులు లాఠీలతో ఒకరిని చుట్టుముట్టి గొడ్డుని బాదినట్టు బాదారు.. అదికూడా పోలీస్ స్టేషన్లో కాదు.. హాస్పిటల్లో.. అతను చేసిన నేరం ఏమిటో తెలుసా..? ఒక పేషేంట్ ను తీసుకుపోయేందుకు ఎవరో అంబులెన్స్ మాట్లాడుకున్నారు.. డబ్బులు దగ్గర పేచీ వచ్చింది.. ఒక కానిస్టేబుల్ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు.. దీన్ని శివరాజ్ అనే ఈ బిజెవైఎం నేత మొబైల్లో వీడియో తీసాడు.. దీన్ని పోలీసు అడ్డుకుంటే గొడవజరిగింది.. కానిస్టేబుల్ తమ సహచరులకు చెప్పడంతో , స్టేషన్ మొత్తం కదిలొచ్చి ఇలా రౌండేశారు..మహారాష్ట్రలోని జల్నా లో జరిగిందిది.. దీనిపై బిజెపి నిరసన వ్యక్తం చేసింది..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..