చికెన్ తింటే బ్లాక్ ఫంగస్.. ? నిజమా..??

    0
    53

    కరోనా నుంచి .. కోలుకుకున్నా బ్లాక్ ఫంగస్ భయం, వైట్ ఫంగస్ గుబులు, చివరగా ఎల్లో ఫంగస్ దెయ్యం.. చివరగా ఈ మూడూ కలిసి దాడిచేసే దుర్భర పరిస్థితి .. కొత్త జబ్బు వచ్చిందంటే , ఆ జబ్బుపై శాస్త్రవేత్తల పరిశోధనల కంటే , సోషల్ మీడియా సైంటిస్టులు వచ్చేస్తారు.. అప్పటికప్పుడు బుర్రలో తొలిచింది చెప్పేస్తారు.. అంతే జనం నమ్మేస్తారు..

    అలాంటిదే చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ వస్తుందని పుకారు.. బ్లాక్ ఫంగస్ కి , చికెన్ కి ఎటువంటి సంబంధంలేదని ఐసిఎమ్మార్ సైంటిస్ట్ తెలిపారు.. బ్లాక్ ఫంగస్ అనేది , షుగర్ వ్యాధితో ఉన్నవారికి , కరోనా వస్తే , దాన్ని అదుపుచేసేందుకు స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వాడితే వచ్చే జబ్బు అని తేల్చారు.. బ్లాక్ ఫంగస్ , వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ ఇవేవీ అంటు వ్యాదులుకావని తేల్చారు. ఇవి పక్షులు , జంతువులు లేదా మనుషులనుంచి అంటువ్యాదుల్లా వచ్చేవికాదని తెలిపారు. అలాగే ఉల్లిపాయల్లో నల్లచారల వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందన్న అభిప్రాయం నిజంకాదని చెప్పారు..

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..