పెట్రోల్ కోసం..బకెట్ తెచ్చుకున్నాడు..ఎందుకంటే.?

  0
  34

  పెట్రోల్ రేట్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.. లీటర్ పెట్రోల్ రేటు దాదాపుగా 110 రూపాయలకు చేరింది. దీంతో పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే జనం హడలిపోతున్నారు. అసలే పెరిగిన రేట్లతో జనం అల్లాడిపోతుంటే.. మరోవైపు బంకుల్లో జరిగే మోసాలతో జనం మరింతగా విసిగిపోతున్నారు. తాజాగా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. వాహనానికి పెట్రోల్ కొట్టించగా ఎందుకో అతడికి అనుమానం వచ్చింది. తీరా చూస్తే పెట్రోల్ బదులుగా నీళ్లు రావడంతో ఆ వ్యక్తి ఖంగు తిన్నాడు. అంతటితో ఊరుకోకుండా ఓ బకెట్ తీసుకొచ్చి పెట్రోల్ కొట్టమని చెప్పాడు. తీరా చూస్తే బకెట్ నిండా నీళ్ళే రావడంతో మరింతగా ఆశ్చర్యపోయాడు. దీంతో ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పెట్టేశాడు. కరీం నగర్ జిల్లాలోని బొమ్మకల్ లో ఈ సంఘటన జరిగింది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.