బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  0
  159

  సెల్ ఫోన్లు పేల‌డం విన్నాం, చూశాం… కానీ బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ? క‌న్నారా ? తొలిసారి బ్లూటూత్ పేలి ఓ వ్య‌క్తి చ‌నిపోయిన ఘ‌ట‌న వెలుగుచూసింది. జైపూర్ లోని ఉద‌య‌పుర గ్రామంలో రాకేష్ అనే వ్య‌క్తి చెవుల‌కు బ్లూటూత్ పెట్టుకుని రోడ్డుపై పోతున్నాడు. అయితే ఉన్న‌ట్లుండి బ్లూటూత్ ఒక్క‌సారిగా పేల‌డంతో అత‌ను తీవ్ర‌గాయాల పాల‌య్యాడు. చెవుల నుంచి తీవ్రంగా ర‌క్త‌స్రావం అవ‌డంతో పాటు త‌ల‌కు గాయాల‌య్యాయి. వెంటనే అత‌నిని చికిత్స కోసం సిద్ధ‌వినాయ‌క్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే చికిత్స పొందుతూ రాకేష్ మృతిచెందాడు. బ్లూటూత్ వాడుతూ మృతిచెందిన ఘ‌ట‌న దేశంలో ఇదే తొలి కేసు కావ‌డం గ‌మ‌నార్హం.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.