కోవిడ్ వ్యాక్సిన్ పై అనేక రకాల వాదనలు తలెత్తుతున్న నేపధ్యంలో బ్రిటన్ లోని డాక్టర్లు రెండు రకాల ఎక్స్ రేలను విడుదల చేశారు. ఇందులో ఒక ఎక్స్ రే, కోవిడ్ పాజిటివ్ వచ్చి.. వ్యాక్సిన్ ను వేయించుకోని వ్యక్తిది అయితే, రెండవ ఎక్స్ రే, కోవిడ్ పాజిటివ్ వచ్చి.., వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తిది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత పాజిటివ్ వచ్చినా, ఊపిరి తిత్తులు బాగానే ఉన్న ఎక్స్ రే ఒకటి. వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తి పాజిటివ్ వచ్చినప్పుడు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న ఎక్స్ రే మరొకటి. అందువల్ల తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని బ్రిటన్ లోని ఎన్‌హెచ్ఎస్ స్పష్టం చేసింది. బ్రిటన్ లో దాదాపు 89 శాతం మొదటి డోస్, 73 శాతం రెండో శాతం పూర్తయింది. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని డాక్టర్ కామెల్ చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి కోవిడ్ పాజిటివ్ వచ్చినా, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి దాదాపుగా రాదని చెప్పారు.